రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బార్డర్‌లో చిల్‌ అవుతున్నారు. జవాన్లతో కలిసి ఆడుపాడుతున్నారు. ఫైటింగ్‌, బోటింగ్‌ చేస్తూ హంగామా చేశారు. 

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆయన వరుసగా ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఆ మధ్య సైనికులతో కలిసి సందడి చేశారు. మరోవైపు అబుదాబి నుంచి ప్రత్యేక ఆహ్వానం పొందాడు. సైనికులతో కలిసి ఆయన సందడి చేసిన వీడియో రిలీజ్‌ చేశారు. ఇందులో ఆయన సైనికుల గురించి, వారి సాధక బాధకాల గురించి తెలుసుకున్నారు. 

ఎన్డీటీవీ ఛానెల్‌ ప్రత్యేకంగా విజయ్‌ దేవరకొండతో కలిసి `జై జవాన్‌` అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే విడుదలైన పలు ఫోటోలు, ప్రోమో ఆసక్తిని క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ఏకంగా ఫుల్ ఎపిసోడ్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో విజయ్‌ చేసిన సందడి, ఆయన సైనికులు గురించి తెలుసుకున్న విషయాలను చూపించారు. ఇందులో ఉరి బార్డర్‌లో డ్యూటీ చేస్తున్న జవాన్‌లను కలిసి వారి విధి విధానాలు, డ్యూటీలో ఉన్న వారి సాధక బాధలు తెలుసుకున్నారు. వారితో కలసి కొన్ని యుద్ధ విద్యల్లోని మెళకువలను నేర్చుకున్నారు విజయ్. 

అంతేకాదు వారితో కలిసి ఫైరింగ్‌ చేశాడు. బోటింగ్‌ ఎలా చేయాలో తెలుసుకున్నారు. కాసేపు సైనికులతో కలిసి గేమ్స్ ఉడుతూ ఉల్లాస పరిచారు. ఫైనల్‌గా జవాన్లతో కలిసి చిందులేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో ఎపిసోడ్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. రౌడీ బాయ్‌ అభిమానులను అలరిస్తుంది. 

YouTube video player

విజయ్‌ దేవరకొండ చివరగా `లైగర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. కానీ బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. దీంతో చిత్ర బృందాన్ని ఈ రిజల్ట్ తీవ్రంగా కుంగదీసింది. దాన్నుంచి విజయ్‌ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అందులో భాగంగానే ఇలాంటి యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. 

నెక్ట్స్ విజయ్‌ `ఖుషి` చిత్రం చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ఇది. సమంత ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. దీని తర్వాత `జెర్సీ` ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇకపై విజయ్‌ కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.