Asianet News TeluguAsianet News Telugu

'ఫ్యామిలీ స్టార్‌' కు ఓటిటి సమస్యా? , ఇదేం ట్విస్ట్

గుంటూరు కారం నెట్ ప్లిక్స్ వారు తీసుకున్నారు. దాంతో మళ్లీ ఎక్కువ రేటు పెట్టి ఫ్యామిలీ స్టార్ తీసుకుని అదే సమయానికి రిలీజ్ చేయటం వల్ల వ్యూస్ పరంగా పోటీ తప్పించి  కలిసి వచ్చేదేమీ లేదని భావిస్తోందట. 

Vijay Devarakonda Family Star Digital Rights Headache For Dil Raju? jsp
Author
First Published Nov 9, 2023, 12:04 PM IST | Last Updated Nov 9, 2023, 12:04 PM IST


ఓటీటి రెవిన్యూ అనేది పెద్ద, చిన్న సినిమా ప్రతీ దానికి ఓ ప్రధాన ఆదాయవనరుగా మారిపోయింది. ఈ క్రమంలో ఓటిటి బిజినెస్ పూర్తయ్యాకే, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. అయితే ఒక్కోసారి అదే రిలీజ్ డేట్ ...ఓటిటి బిజినెస్ కు అవరోధంగా మారిపోతోంది. తాజాగా అలాంటి సిట్యువేషన్ ....విజయ్ దేవరకొండ తాజా  సినిమా ఫ్యామిలీ స్టార్  కు ఏర్పడిందనే వార్తలు వస్తున్నాయి. ఓటిటి బిజినెస్ ఇబ్బంది ఏర్పడటంతో నిర్మాత దిల్ రాజు టెన్షన్ గా ఉన్నట్లు మీడియా వర్గాల్లో  ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే...

  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజా క్రేజీ సినిమా ఫ్యామిలీ స్టార్‌ (Family Star). VD13గా వస్తున్న ఈ చిత్రానికి పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే టైటిల్‌ లుక్‌ ఫ్యామిలీ స్టార్‌ను షేర్ చేస్తూ.. లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఫ్యామిలీ స్టార్‌లో మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.అదే సమయంలో  సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. #Airanevanchalaenti ఏంటి హ్యాష్ ట్యాగ్‌తో నయా లుక్‌ను విడుదల చేశారు. విజయ్‌ దేవరకొండ ఐరన్‌ను పట్టుకున్న లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.
 
ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అయితే అదే సంక్రాతికి మహేష్ బాబు గుంటూరు కారం సైతం రిలీజ్ అవుతోంది. దాంతో ఓటిటి రిలీజ్ రిలీజ్ లు రెండూ ఒకేసారి వస్తాయి. దాదాపు నాలుగు నుంచి ఆరు వారాల తేడాలో ఓటిటిలో వస్తాయి. ఆల్రెడీ గుంటూరు కారం నెట్ ప్లిక్స్ వారు తీసుకున్నారు. దాంతో మళ్లీ ఎక్కువ రేటు పెట్టి ఫ్యామిలీ స్టార్ తీసుకుని అదే సమయానికి రిలీజ్ చేయటం వల్ల కలిసి వచ్చేదేమీ లేదని భావిస్తోందట. మరో ప్రక్క వెంకటేష్ సైంధవ్ ని అమేజాన్ ప్రైమ్ తీసుకుంది. 

దాంతో అమేజాన్ ప్రైమ్ కు దాదాపు అలాంటి సమస్యే వస్తోందిట. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ సినిమా ఓటిటి రైట్స్ కు నిర్మాత దిల్ రాజు చెప్పిన రేటు వర్కవుట్ కాదని రెండు ఓటిటి సంస్దలు పెండింగ్ పెట్టాయనే వార్త ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అయితే డిజిటిల్ రైట్స్ అమ్మకం తో సంభందం లేకుండా దిల్ రాజు ఖచ్చితంగా సంక్రాంతి రేసులోకి వస్తారనేది మాత్రం నిజం. ఆ దిల్ , దమ్ము ఉన్న నిర్మాత దిల్ రాజు.  ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు తెరకెక్కిస్తున్నారు.   ఈ బ్యానర్‌లో వస్తున్న 54వ ప్రాజెక్ట్‌. 

 ఫ్యామిలీ స్టార్ స్టోరీ లైన్ ని విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా  లీక్ చేశాడు. ప్ర‌తి ఫ్యామిలీ లో నుంచి ఓ పిల్లాడు ఆ ఫ్యామిలీ క‌ష్టాల‌ను, డైరెక్ష‌న్‌ను, ఫ్యూచ‌ర్ జ‌న‌రేష‌న్‌ను మార్చేస్తాడు. ఫ్యామిలీ స్టార్ అలాంటి క‌థే అని తెలిపాడు. త‌న రియ‌ల్‌లైఫ్‌కు క‌నెక్ట్ అయ్యింద‌ని తెలిపాడు. నా వ‌ల్ల నా ఫ్యామిలీ లైఫ్ మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios