జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగాజవానులు వీరమరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా అగ్రజ్వాలలు చెలరేగుతున్నాయి. ప్రతి ఒక్కరూ సైనికుల కుటుంబాలకు తమ సానుభూతి తెలుపుతున్నారు.

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు చాలా మంది సెలబ్రిటీలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. అయితే వారిలో హీరోవిజయ్ దేవరకొండ ఓ అడుగు ముందుకేసి సైనిక కుటుంబాలను ఆడుకోవడం కోసం ఆర్ధిక సహాయం చేశాడు.

వీరమరణం పొందిన జవానుల కుటుంబాలను ఆదుకోవాలని అందరికీ పిలుపినిచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ''వారు మన కుటుంబాల్నిరక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేమని'' అన్నారు.

కానీ మన వంతు సహాయం అందించాలని, మనమందరం కలిసి సాయం చేద్దామని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. మరి విజయ్ ట్వీట్ కి స్పందించి ఎంతమంది సహాయం అందిస్తారో చూడాలి!