'గీత గోవిందం' సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మికల జంటకి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. అయితే అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర విజయ్ దేవరకొండ.. రష్మికకు ఓ ఫోటో తీశాడు. ఆ ఫోటోని రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫోటో క్రెడిట్స్ విజయ్ కి ఇచ్చింది.

ఇప్పటివరకు ఈ ఫోటోకి మూడున్నర లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అయితే ఇదే లొకేషన్ లో గతంలో విజయ్ దేవరకొండ ఓ ఫోటో షేర్ చేసి ఆ ఫోటో రష్మిక తీసినట్లు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తాజాగా రష్మిక కూడా అదే లొకేషన్ లో విజయ్ తో ఫోటో తీయించుకుంది. క్యాజువల్ టీ షర్ట్, ప్యాంట్ వేసుకొని ప్రకృతిని ఆశ్వాదిస్తూ.. కనిపిస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🙈🥰 . . . . PC - Comrade @thedeverakonda

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on Apr 26, 2019 at 6:28am PDT