స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్!

vijay devarakonda charged one crore for new endorsement deal
Highlights

మరో కంపనీకు ప్రచారకర్తగా విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది

టాలీవుడ్ లో రెండే రెండు హిట్ సినిమాలతో టాప్ లీగ్ లోకి చేరిపోయాడు విజయ్ దేవరకొండ. స్టార్ హీరోలతో సమానంగా కాకపోయినా తనకంటూ ఓ రేంజ్ ను బిల్డప్ చేసుకున్నాడు ఈ నటుడు. సోషల్ మీడియాలో తన అభిమానులతో తరచూ ముచ్చటిస్తూ వారికి మరింత దగ్గరవుతున్నాడు. ప్రస్తుతం ఏ హీరో లేనంత బిజీగా వరుస ఉన్నాడు విజయ్ దేవరకొండ. త్వరలోనే అతడు నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి. 

ఓ పక్క సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోపక్క యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని  కంపనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న విజయ్ దేవరకొండ తాజాగా మరో కంపనీకు ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నాడు. ఒక మొబైల్ స్టోర్ సంస్థ విజయ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొబైల్ స్టోర్స్ వాళ్లు విజయ్ ఫోటోలను వాడుకోవచ్చు.

అలానే విజయ్ పై యాడ్ కూడా షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికోసం హీరో గారు అందుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ తినాల్సిందే. దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ ను విజయ్ కు అందించారు. ఇప్పటివరకు స్టార్ హీరోలు మాత్రమే యాడ్స్ కోసం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. అలాంటిది వారితో సమానంగా విజయ్ కు పారితోషికం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భవిష్యత్తులో తన రేంజ్ ను ఇంకెంతగా పెంచుకుంటాడోచూడాలి!

loader