మెహరీన్ తో పండగ చేసుకుంటూ అడ్డంగా బుక్కైన విజయ్ దేవరకొండ

First Published 9, Dec 2017, 5:19 PM IST
vijay devarakonda celebrates holi with mehreen
Highlights
  • నెట్ లో హల్ చల్ చేస్తున్న మెహ్రీన్, విజయ్ పిక్
  • హోలీ ఆడుకుంటూ సందడి చేస్తున్న మెహ్రీన్,,విజయ్ లు
  • దీంతో విజయ్ సరసన మెహరీన్ హిరోయిన్ గా నటిస్తోందని చర్చ

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో క్రేజీ హీరోగా మారాడు. ఈ మూవీలో  వెరైటీ యువకుని పాత్రలో నటించి పెళ్లిచూపులుతో వచ్చిన ఇమేజ్ ను మరింత ముందుకు తీసుకెళ్లి స్టార్ ఆఫ్ టాలీవుడ్ అనిపించుకున్నాడు. విజయ్ దేవరకొండ ఇమేజ్ ఒక్కసారిగా పెరగడంతో అతని నెక్స్ట్ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

 

తాజాగా ఓ హిరోయిన్ తో పండగ చేసుకుంటూ తీసిన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో విజయ్ ఆమెతో నటిస్తున్నాడా లేక ఎక్కడైనా వేడుకల్లో ఇలా స్పెషల్ గా ఫోజిచ్చాడా అనే న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె కొత్త హీరోయిన్ అయితే ఫరవాలేదు కానీ కొన్ని సినిమాలను చేసిన హీరోయిన్ అయ్యేసరికి క్లారిటీ రావడం లేదు. మహానుభావుడు - రాజా ది గ్రేట్ సినిమాలతో ఈ ఏడాది వరుస హిట్స్ అందుకున్న మెహ్రీన్ పిర్జాదా - విజయ్ తో హోలీ జరుపుకోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. 


ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు. కానీ అందులో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు.

 

అయితే మెహ్రీన్ తో దిగిన సెల్ఫీ ఎక్కడిదబ్బా అనే కన్ఫ్యూజన్ లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బహుశా పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోందా లేక రాహుల్ సినిమాలోని హీరోయినా అనే అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి.

loader