Asianet News TeluguAsianet News Telugu

దేవరకొండ బ్రదర్ - రాజశేఖర్ డాటర్.. డేట్ సెట్టయ్యింది!

ఆనంద్ దేవరకొండ కూడా టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమయ్యాడు. అతనితో పాటు రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ఎంట్రీ ఇవ్వనుంది. వీరిద్దరూ దొరసాని అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. స్టార్స్ ఫ్యామిలీ నుంచి వస్తుండడంతో అంచనాలు పెరిగాయి. 

vijay devarakonda brother first movie update
Author
Hyderabad, First Published Sep 28, 2018, 2:57 PM IST

పెళ్లి చూపులు సినిమాతో సైలెంట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ ఆ తరువాత డిఫరెంట్ సినిమాలతో మరిన్ని బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతని సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమయ్యాడు. అతనితో పాటు రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ఎంట్రీ ఇవ్వనుంది. 

వీరిద్దరూ దొరసాని అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. స్టార్స్ ఫ్యామిలీ నుంచి వస్తుండడంతో అంచనాలు పెరిగాయి. ఇకపోతే సినిమాకు సంబందించిన వార్తల్లోకి వెళితే.. అక్టోబర్ 10న సినిమా లాంచ్ కార్యక్రమాన్ని జరుపనున్నారు. అదేరోజు షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. సినిమా పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. 

ప్రస్తుతం నటీనటులు వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు. పూర్తిగా తెలంగాణ భాషపై పట్టు సాదించేందుకు ఆనంద్ శివాత్మిక ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఇక షార్ట్ ఫిల్మ్స్ దర్శకుడు కెవిఆర్.మహేంద్ర సినిమాను తెరక్కిస్తుండగా పెళ్లి చూపులు కో-ప్రొడ్యూసర్ అండ్ విజయ్ దేవరకొండ బంధువు యష్ రాగినేని - మధుర శ్రీధర్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.           

Follow Us:
Download App:
  • android
  • ios