విజయ్ కొత్త అవతారం: స్టూడెంట్, లెక్చరర్ ఇప్పుడేమో సాఫ్ట్ వేర్ ఇంజనీర్..

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 16, Aug 2018, 3:05 PM IST
Vijay Devarakonda Become A Software Engineer
Highlights

ఇప్పటివరకు స్టూడెంట్ గా, లెక్చరర్ గా కనిపించిన ఈ హీరోగారు ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడట. దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందించనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు విజయ్ దేవరకొండ

తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ క్లబ్ లో చేరిపోయాడు. అర్జున్ రెడ్డితో విజయ్ కి ఏర్పడిన ఫాలోయింగ్ మామూలుది కాదు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక రీసెంట్ గా 'గీత గోవిందం' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు.

సినిమా సినిమాకు తన పాత్రల మధ్య వేరియేషన్ చూపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తోన్న ఈ హీరో తదుపరి సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనే విషయంలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు స్టూడెంట్ గా, లెక్చరర్ గా కనిపించిన ఈ హీరోగారు ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడట.

దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందించనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు విజయ్ దేవరకొండ. కథ ప్రకారం హీరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా కనిపించనుందని టాక్. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ఈ లవ్ స్టోరీ సెట్స్ పైకి వెళ్లనుంది. 

loader