విజయ్ దేవరకొండకు షాకింగ్ సంఘటన ఎదురైంది. లైగర్ ప్రమోషనల్ ఈవెంట్ లో ఫ్యాన్స్ అత్యుత్సాహం ఆయన్ని భయాందోళనకు గురి చేసింది. దీంతో ఈవెంట్ మధ్యలోనే అక్కడి నుండి వెళ్లిపోయారు.  

మరో 25 రోజుల్లో లైగర్(Liger) వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో విరివిగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. లైగర్ మూవీ హిందీ లో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో టీమ్ ముంబైలో ఎక్కువగా ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు. జులై 31న నావీ ముంబైలో గల ఓ షాపింగ్ మాల్ కి వస్తున్నట్లు విజయ్ దేవరకొండ, అనన్య ప్రచారం చేశారు. దీంతో ఊహించిన దానికి మించి అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఇక మాల్ లో విజయ్ దేవరకొండ, అనన్యలను చూసిన ఫ్యాన్స్ తమ ఉత్సాహం కంట్రోల్ చేసుకోలేకపోయారు. 

అభిమానుల నినాదాలతో షాపింగ్ కాంప్లెక్స్ హోరెత్తిపోయింది. వందల మంది ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం సిబ్బంది వల్ల కాలేదు. చూస్తే తొక్కిసలాట జరిగేలా ఉంది. ప్రశాంతంగా ఉండాలంటూ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఎంత వారించినా వినే పరిస్థితి లేదు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో విజయ్ దేవరకొండ, అనన్య మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. అందరూ క్షేమంగా ఇంటికి చేరారని ఆశిస్తున్నాను... అంటూ తన ట్వీట్ లో పొందుపరిచారు. 

Scroll to load tweet…

ముంబైలో ఓ టాలీవుడ్ హీరో క్రేజ్ చూసి బాలీవుడ్ మీడియా సైతం విస్తుపోతుంది. ఈ సంఘటనను మీడియాలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక ఆగస్టు 25న లైగర్ వరల్డ్ వైడ్ హిందీ, తెలుగు, తమిళ్. మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. దర్శకుడూ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ చిత్రంలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తున్నారు. అనన్య పాండే(Ananya Panday) హీరోయిన్ గా నటిస్తున్నారు. రమ్య కృష్ణ, మైక్ టైసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Scroll to load tweet…