రీసెంట్ గా డియర్ కామ్రేడ్ సినిమాతో సౌత్ ఆడియెన్స్ ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఊహించని విధంగా అపజయాన్ని అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా నాలుగు భాషల్లో తన సినిమాను రిలీజ్ చేసిన విజయ్ ఒక్క భాషలో కూడా సక్సెస్ కాలేకపోయాడు. 

ఇక సినిమాపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ గురించి అలాగే విజయ్ తనపై వచ్చిన కామెంట్స్ గురించి స్పందించాడు. కేవలం తెలుగు సినిమాలో ఇలాంటి నెగిటివీటి ఉండడం చాలా బాధగా ఉందని అయితే వీటిని తాను అంతగా పట్టించుకోనని ఎవరి ఇష్టం వాళ్ళది అని కూల్ గా కౌంటర్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ సినిమాతో ఆడియెన్స్ మంచి సినిమా అందించేందుకు కష్టపడతానని విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చాడు. 

ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో విజయ్ రైటర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇటీవల ఛార్మి ఆ విషయాన్నీ అధికారికంగా తెలిపిన సంగతి తెలిసిందే.