దివంగత తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇటీవల కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో జాన్వీకపూర్ సౌత్ హీరో విజయ్ దేవరకొండపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

విజయ్ దేవరకొండ అంటే తనకు ఇష్టమని అతడితో కలిసి నటించాలనుందని వెల్లడించింది. ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ వద్ద ప్రస్తావించగా.. 'నేను కూడా జాన్వీతో, కరణ్ జోహార్ తో కలిసి త్వరలోనే పని చేస్తాను' అని తెలిపారు.

గతంలో విజయ్ దేవరకొండ.. కరణ్ జోహార్ ఆఫీస్ కి వెళ్లాడు. ఈ విషయాన్ని 'టాక్సీవాలా' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడిస్తూ.. ''నేను ముంబైలో కరణ్ జోహార్ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు నేనేంటి ఇక్కడ..? అనిపించింది'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదంతా చూస్తుంటే కరణ్ జోహార్ తో కలిసి విజయ్ త్వరలోనే సినిమా చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

ఇది కూడా చదవండి.. 

విజయ్ దేవరకొండపై జాన్వీ కపూర్ స్పెషల్ ఇంట్రెస్ట్!