ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ అతి కొద్ది కాలంలో స్టార్ హోదా దక్కించుకున్నాడు. వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు. రీసెంట్ గా 'టాక్సీవాలా'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఓ సంఘటనని బట్టి అక్కడ కూడా అతడికి ఉన్న క్రేజ్ బయటపడింది. అసలు విషయంలోకి వస్తే.. దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఓ పాపులర్ టీవీ షోలో పాల్గొంది.

ఈ సందర్భంగా ఆమెకి 'ఒకవేళ నువ్వో రోజు ఓ మేల్ యాక్ట‌ర్‌గా నిద్ర లేస్తే… ఎవరిలా మేల్కోవాలని అనుకుంటావ్? ఎందుకు?' అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. మంచి టాలెంట్ ఉన్న నటుడు అంటూ అతడిని పొగిడేసింది. అంతేకాదు.. తనతో సినిమా చేయాలని ఉందని వెల్లడించింది.

ఆమె మాటలు వింటుంటే విజయ్ దేవరకొండపై జాన్వీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుందని అనిపించక తప్పదు. గతంలో విజయ్ దేవరకొండతో జాన్వీ ఓ సినిమా చేస్తుందని వార్తలు వినిపించాయి కానీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడైనా ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందేమో చూడాలి!