దళపతి విజయ్‌ తన అభిమానులకు వాలెంటైన్స్ డే సందర్భంగా అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు. ఆయన నటిస్తున్న `బీస్ట్` చిత్రం నుంచి తొలి పాటని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌ అవుతుంది.

దళపతి విజయ్‌(Vijay) నటించిన `బీస్ట్`(Beast) చిత్రం నుంచి వాలెంటైన్స్ గిఫ్ట్ వచ్చింది. ఈ చిత్రంలోని తొలి సాంగ్‌ `అరబిక్‌ కుత్తు`(Arabic Kuthu)ని ప్రేమికుల రోజు సందర్భంగా సాయంత్రం విడుదల చేశారు. విజయ్‌, పూజాల మధ్య వచ్చే ఈ డ్యూయెట్‌ సాంగ్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అవుతుంది. ఈ పాటకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం సమకూర్చగా, ఈ పాటని హీరో శివకార్తికేయన్‌ రాయడం విశేషం. ప్రస్తుతం ఈ పాట మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. యూట్యూబ్‌ని షేక్‌ చేస్తుంది. 

Scroll to load tweet…

ఈ పాటలో Vijay తనదైన స్టయిలీష్‌ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. అదరగొడుతున్నారు. పూజా హెగ్డేతో కలిసి ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఈ పాటకి జానీ మాస్టర్‌ డాన్సులు కంపోజ్‌ చేశారు. పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని మించి ఈ పాట ఉండాలని భావించారు సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌. వరల్డ్ వైడ్‌గా ఆకట్టుకునేలా కంపోజ్‌ చేశారు. అందుకే దీనికి `అరబిక్‌ కుత్తు` అని పెట్టారు. ఈ పాట ఇంతగా ఆకట్టుకోవడానికి, అంచనాలు పెంచుకోవడానికి కారణం.. శివకార్తికేయన్​ ఇచ్చిన అరబిక్​ టచ్​. అరబిక్‌ హమ్మింగ్‌ పదాలను సేకరించి, వాటికి తమిల పదాలు మేళవించి రాశాడట శివకార్తికేయన్‌. 

ఈ పాట ద్వారా తనకు వచ్చిన రెమ్యూనరేషన్‌ని సేవా కార్యక్రమానికి ఉపయోగించారు శివకార్తికేయ. సినీ గేయ రచయిత దివంగత ముత్తుకుమార్‌ ఆరేళ్ల క్రితం చనిపోయారు. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. `అరబిక్‌ కుత్తు` పాటకిగానూ అందుకున్న పారితోషికాన్ని ముత్తుకుమార్‌ ఫ్యామిలీకి అందజేశారు శివ కార్తికేయన్‌. కోలీవుడ్​ సెన్సేషన్​ నెల్సన్ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో `బీస్ట్` చిత్రం రూపొందుతుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇదిరూపొందుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు.