Asianet News TeluguAsianet News Telugu

విజయ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అట్లీ!

విజయ్, అట్లీ హ్యాట్రిక్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. దీనితో ఈ హ్యాట్రిక్ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

vijay, Atlee movie first look
Author
Hyderabad, First Published Jun 21, 2019, 7:33 PM IST

విజయ్, అట్లీ హ్యాట్రిక్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. దీనితో ఈ హ్యాట్రిక్ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జూన్ 22న శనివారం రోజు విజయ్ బర్త్ డే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే విజయ్, అట్లీ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. 

ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలని రెట్టింపు చేసే విధంగా ఉంది. ఈ చిత్రానికి 'బిగిల్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ డ్యూయెల్ రోల్ లో మెరవబోతున్నాడు.  ఫస్ట్ లుక్ లో విజయ్ రెండు పాత్రలని పరిచయం చేశారు. విజయ్ పంచె కట్టులో కుర్చీలో కూర్చుని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతడి కాలు వద్ద కత్తి ఉంది. అతడి వెనుక విజయ్ యంగ్ లుక్ లో కనిపిస్తూ చేతితో ఫుట్ బాల్ పట్టుకుని ఉన్నాడు. 

రెండు పాత్రల్లో విజయ్ అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాడు. ఈ చిత్రం ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కుతుందని మాత్రం ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. కానీ విజయ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తుండడం మాత్రం ఊహించని ట్విస్టే. ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో విజయ్ అభిమానుల సందడి పెరిగింది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios