కోలీవుడ్ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ మొదటిసారి తన సినిమాకు మరో సంగీత దర్శ/కుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. అది కూడా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బాణీలను కావాలనుకోవడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ గా క్లిక్ అయినా విజయ్ ఆంటోని హీరోగా నిలదొక్కుకోవడానికి మంచి మంచి సినిమాలను వదులుతున్నాడు. 

బిచ్చగాడు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన విజయ్ అంతకుముందు మహాత్మ - దరువు సినిమాలకు సంగీతం అందించాడు. ఇకపోతే రీసెంట్ గా తమిళరసన్ అనే సినిమాను మొదలుపెట్టిన విజయ్ ఆ సినిమాకు ఇళయరాజాను మ్యూజిక్ డైరెక్టర్ గా సెట్ చేసుకున్నాడు. ప్రతిసారి తన సినిమాలకు తానే  మ్యూజిక్ అందించే ఈ బిచ్చగాడు హీరో మొదటిసారి బయటి బాణీలు కావాలంటూ  వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. 

ఇక బిచ్చగాడు సినిమా అనంతరం చాలా సినిమాలు చేసిన విజయ్ అనుకున్నంత స్థాయిలో హిట్టందుకోలేదు. కొత్త కథలను తీసుకువచ్చే యువ దర్శకులకు విజయ్ సొంత ప్రొడక్షన్ హౌస్ లోనే అవకాశాలు ఇస్తూ తను హీరోగా నటిస్తున్నాడు.