Asianet News TeluguAsianet News Telugu

ఏదైనా తేడా వ‌చ్చిందా..?: ‘విజయ రాఘవన్‌’ ట్రైలర్


 ‘బ్లేడు శ్రీను, గజ్జల బాబ్జీ, అలీ భాయ్‌, గుండు రాజు.. వాళ్లురా నేరస్థులు. వాళ్లని అరెస్ట్‌ చేయండి. వాళ్లని చేయకుండా బడికి వెళ్లే పిల్లల్ని అరెస్ట్‌ చేస్తారేంట్రా’ అని మిషన్‌ కుట్టే వ్యక్తి చెప్పే భారీ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది.

Vijay Antony's Vijaya Raghavan trailer out
Author
Chennai, First Published Aug 3, 2021, 12:16 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

‘‘నేరాలు చేసే వాళ్ల‌ని వ‌దిలేసి స్కూలుకెళ్లి చ‌దువుకునే చిన్న చిన్న పిల్ల‌ల్ని ప‌ట్టుకుని అరెస్ట్ చేస్తారేంట్రా ప‌నికిమాలిన సుంట‌ల్లారా!’’ అంటూ ఓ వ్య‌క్తి పోలీసుల‌ను తిడుతున్న సీన్‌ హైలెట్ గా ట్రైలర్ విడుదలైంది. ఓ  ట్యూషన్‌ మాస్టర్‌ ఐఏఎస్‌ అయితే ఎలా ఉంటుందో కాన్సెప్టుతో రూపొందింది ‘విజయ రాఘవన్‌’. విజయ్‌ ఆంటోనీ హీరోగా ఆనంద కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న  నేపథ్యంలో ట్రైలర్‌ని విడుదల చేశారు దర్శకనిర్మాతలు. రానా ఈ ట్రైలర్ ని షేర్ చేసారు.

 ‘బ్లేడు శ్రీను, గజ్జల బాబ్జీ, అలీ భాయ్‌, గుండు రాజు.. వాళ్లురా నేరస్థులు. వాళ్లని అరెస్ట్‌ చేయండి. వాళ్లని చేయకుండా బడికి వెళ్లే పిల్లల్ని అరెస్ట్‌ చేస్తారేంట్రా’ అని మిషన్‌ కుట్టే వ్యక్తి చెప్పే భారీ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది.

 ‘బ‌య‌టూరోడివా’ అని హీరోని ఓ సైడ్ విల‌న్ ప్ర‌శ్నిస్తే.. ‘అర‌కు ప‌క్క‌న‌’ అంటూ హీరో విజ‌య్ ఆంటోని స‌మాధానం చెప్ప‌డం.. ‘ఏదైనా తేడా వ‌చ్చిందా పేగులు తీసి మెళ్లో వేసుకుంటా’ మ‌రో సైడ్ విల‌న్ వార్నింగ్ ఇవ్వ‌డం, హీరో త‌న‌ని తాను ట్యూష‌న్ మాస్ట‌ర్ అని ప‌రిచ‌యం చేసుకోవ‌డం.. ఐఏఎస్‌కి ప్రిపేర్ అయ్యే హీరో బ‌స్తీలో చ‌దువుకోవాల‌నుకునే కుర్రాళ్ల కోసం స్పెష‌ల్ క్లాసులు చెప్ప‌డం.. పాడ‌వ‌కుండా ఉండాల‌ని ఆధార్ కార్డుని లామినేష‌న్ చేస్తారు కానీ.. చెద‌లు ప‌ట్టిన మా జీవితాల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు అంటూ ఓ బ‌స్తీ మ‌హిళ హీరో ద‌గ్గ‌ర బాధ‌ప‌డటం చూస్తుంటే ఎమోషన్ సీన్లు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

 అలాగే ‘ఏదో ఒక ప‌క్క నిల్చోవాలి త‌మ్ముడు.. సెంట‌ర్‌లో నిల్చున్నావంటే రెండు ప‌క్క‌ల నుంచి న‌లిగిపోతావ్’’ అంటూ కె.జి.య‌ఫ్ విల‌న్ రామ‌చంద్ర‌రాజు హీరోని బెదిరించ‌డం.. ‘జీత‌మే లేని ఓ కార్పొరేట‌ర్ సీటుని ఓ పార్టీ కోటి ఇచ్చి కొనుక్కుంటుంది.. ల‌క్ష జీత‌ముమ‌న్న ఎమ్మెల్యే సీటుకి ప‌దిహేను కోట్లు, ఎంపీకి ఇర‌వై ఐదు కోట్లు.. మొత్తం ఇలా ఎన్ని వేల కోట్లు.. వీళ్లంద‌రూ గెలిచొచ్చి ఏం పీకుతున్నారో అంద‌రికీ తెలిసిందే క‌దా..’ అని అసెంబ్లీలో హీరో ఎమోష‌న‌ల్ డైలాగ్ చెప్ప‌డం.. మ‌ధ్య‌లో హీరోయిన్ ఆత్మిక‌తో హీరో ల‌వ్‌ట్రాక్ సీన్స్‌, విల‌న్స్‌తో హీరో చేసే యాక్ష‌న్ సీన్స్ చూస్తుంటే.. దర్శకుడు ఈ చిత్రంలో అన్ని అంశాలను టచ్ చేసినట్లుగా అర్థమవుతుంది. ఓ బ‌స్తీ.. అందులో రౌడీయిజం చేసే రౌడీలు.. వారిని ఎదుర్కొవడానికి వ‌చ్చిన హీరో.. దానికి సంబంధించిన రాజ‌కీయాలు.. వీటి కాంబినేష‌న్‌లో క‌ట్ చేసిన ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని క్రియేట్ చేసేలా ఉంది. త్వ‌ర‌లోనే చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

 ‘మా ఏరియా ట్యూషన్‌ మాస్టర్‌.. ఐఏఎస్‌ చదువుతున్నాడు’ అని హీరో పాత్రని చూపించిన తీరు మెప్పిస్తుంది. రాజకీయ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ‘ఒకే ఒక సంవత్సరంలో మన కాలనీని చిన్న సింగపూర్‌లా మార్చేస్తాను’ అని ఓ రాజకీయ నాయకుడు వాగ్దానం చేయగా ‘చిన్న సింగపూర్‌లా మారుస్తాను.. చిన్న జపాన్‌లా మారుస్తానని అందరూ మా బస్తీని చిన్న శ్మశానంలా మార్చేశారు. అందరూ మోసగాళ్లే’ అంటూ ఓ మహిళ ఇచ్చిన సమాధానం అలరిస్తుంది. మరి విజయ్‌ రాఘవన్‌ అనుకున్న లక్ష్యం చేరుకున్నాడా? అనూహ్యంగా రాజకీయ నాయకుడిగా మారాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో విజయ్‌ సరసన ఆత్మిక నటిస్తోంది. రామచంద్రరాజు, ప్రభాకర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టి.డి. రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నివాస్‌ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios