Asianet News TeluguAsianet News Telugu

కూతురు లేదనే బాధలోనూ.. సినిమా కోసం నిలబడ్డ విజయ్ ఆంటోనీ.. ఎమోషనల్ అయిన నిర్మాత

కూతురు చనిపోయిన తొమ్మిదిరోజుల్లోనే విజయ్ ఆంటోని తిరిగి సినిమా పనుల్లోకి దిగారు. బిడ్డను కోల్పోయిన బాధలోనూ సినిమా కోసం బయటకి రావడం పట్ల ఫ్యాన్స్ ఎమోషన్ అవుతున్నారు.  
 

Vijay Antony Promotes his film Raththam nine days after Daughters Death NSK
Author
First Published Sep 29, 2023, 4:40 PM IST

కోలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony)  పుట్టెడు శోకంలో మునిగిపోయారు. ఈనెల 19న ఆయన పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కూతురు సూసైడ్ తో విజయ్ ఆంటోని, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంత బాధలోనూ విజయ్ ఆంటోనీ తన రాబోయే చిత్రం కోసం ఇంటి నుంచి బయటికి వచ్చారు. అప్ కమింగ్ ఫిల్మ్ ‘రత్తం’ (Raththam)  మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. పలు ఇంటర్వ్యూల్లో కనిపించారు. 

తన సినిమాకు పెట్టుబటి పెట్టిన నిర్మాతలు, శ్రమించిన యూనిట్ దృష్టిలో ఉంచుకోని ప్రచార కార్యక్రమాలకు కదిలారు. పుట్టెడు శోఖంలోనూ విజయ్ ఆంటోనీ పనిలోకి దిగడంతో ఆయన వృత్తిరీత్యా ఆయనకున్న క్రమశిక్షణను మెచ్చుకుంటున్నారు. కోట్లు ఖర్చుచేసిన ప్రొడ్యూసర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సపోర్ట్ చేస్తున్న ఆయన్ని ప్రశంసిస్తున్నారు. మరోవైపు ‘రత్తం’ ప్రమోషన్స్  లో తన చిన్న కూతురు లారాతో కలిసి హాజరవడం పట్ల ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. 

సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధతను సినీ ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ జీ దనంజయన్ ఎమోషన్ పోస్ట్ తో నోట్ రాసుకొచ్చారు. ‘విజయ్ ఆంటోనీ సార్ కు వృత్తి పట్ల నిజమైన ఉదాహరణ ఇది.  తన నిర్మాతలు, ఆడియెన్స్ కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. మా సినిమా రథంకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు పలు ఛానెల్‌లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి తన బృందానికి మద్దతుగా నిలిచారు. పరిశ్రమకు గొప్ప ప్రేరణగా, బెంచ్‌మార్క్ గా మారరు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

 

Follow Us:
Download App:
  • android
  • ios