Asianet News TeluguAsianet News Telugu

విజయ్ ఆంటోనీ `హిట్లర్‌` ఫస్ట్ లుక్.. ఊరికి ఆత్మ ఉంటే..

`బిచ్చగాడు2`తో సూపర్‌ హిట్‌ అందుకున్న విజయ్‌ ఆంటోని ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. `హిట్లర్‌` అంటూ అలరించబోతున్నారు. మరోవైపు ఊరికి ఆత్మ ఉంటే ఏమవుతుంది. ఇదిప్పడు ఆసక్తికరంగా మారింది. 

vijay antony hitler first look and madhurapudi gramam crazy update arj
Author
First Published Sep 29, 2023, 8:59 PM IST

`బిచ్చగాడు2`తో ఆకట్టుకున్న విజయ్‌ ఆంటోని ఆ మధ్య `హత్య` అంటూ పలకరించారు. కానీ అది ఆడలేదు. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. `హిట్లర్‌` అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌తో వస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం విశేషం. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా హిట్లర్ సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. `హిట్లర్` సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్  చేశారు.

ట్రైన్ జర్నీలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ ను ఎదుర్కొన్నట్లు మోషన్ పోస్టర్ లో చూపించారు. ఇదే ట్రైన్ లో హీరోయిన్ రియా సుమన్ హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తోన్న గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. మోషన్ పోస్టర్ లో విజయ్ ఆంటోనీ ఫ్రెష్ లుక్ లో ఉన్నారు. చివరలో ఆయన జోకర్ గెటప్ లో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ట్రైన్ జర్నీ నేపథ్యంగా రూపొందించిన మోషన్ పోస్టర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

vijay antony hitler first look and madhurapudi gramam crazy update arj

ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే హిట్లర్. హిట్లర్ ఒక పేరు కావొచ్చు కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య పరిస్థితుల్లో ఆ పేరు నియంతలకు మారుపేరుగా మారింది. అందుకే సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ అనుకున్నాం అని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న హిట్లర్ మూవీని త్వరలో పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ,తెలుగు,మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

ఊరికి ఆత్మ ఉంటే అదే `మధురపూడి గ్రామం అనే నేను`

vijay antony hitler first look and madhurapudi gramam crazy update arj

మ‌నుషుల‌కి ఆత్మ‌లు ఉన్న‌ట్టే..ఒక ఊరికి ఆత్మ ఉంటే..ఆ ఆత్మ త‌న క‌థ తానే చెబితే ఎలా ఉంటుంది అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం “మధురపూడి గ్రామం అనే నేను”.  శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క‌ళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా.. ద‌ర్శ‌కుడు మ‌ల్లి మాట్లాడుతూ - ``ఒక డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా  చేద్దాం అని “మధురపూడి గ్రామం అనే నేను” అనే సినిమాను రూపొందించ‌డం జ‌రిగింది. ల‌వ్‌, ఫ్రెండ్‌షిప్‌, పాలిటిక్స్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న్ ఇలా ఒక ఊరిలో ఎమైతే  ఎగ్జ‌యిటింగ్ అంశాలు ఉంటాయో అవ‌న్నీ ఈ మ‌ట్టి క‌థ‌లో ఉన్నాయి. ఒంగోలు, చీరాల బ్యాక్‌డ్రాప్లో జ‌రిగే క‌థ ఇది. హీరోగా శివ కంఠ‌మ‌నేని గారు ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్‌..అద్బుత‌మైన న‌ట‌న‌ని క‌న‌బ‌రిచారు. హీరోయిన్‌గా క్యాథ‌లిన్ గౌడ ఒక డిఫ‌రెంట్ పాత్ర‌లో త‌ప్ప‌క‌ మెప్పిస్తుంది.

చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠభరితంగా సాగుతూ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది అనే న‌మ్మ‌కం ఉంది` అన్నారు. చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, `కాన్సెప్ట్ ఓరియంటేష‌న్‌తో ఒక మంచి యాక్ష‌న్ డ్రామాగా  ఖ‌ర్చుకి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా  “మధురపూడి గ్రామం అనే నేను” చిత్రాన్ని గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ తో మీ ముందుకు వ‌స్తాం` అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios