విజయ్ ఆంటోనీ “హత్య” కి డేట్ ఫిక్స్.!
1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా 'హత్య' సినిమా సాగనుంది.
డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ రీసెంట్ గా బిచ్చగాడు 2 చిత్రంతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఆ ఉషారులో తన కొత్త సినిమా 'హత్య'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా..నాయిక రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు.
ఈ చిత్రం ఈ జూలై 21న రెండు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో తెలిపారు. ఈ పోస్టర్ లో విజయ్ ఆంటోనీ ఒక ఏజ్డ్ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. విజయ్ ఆంటోనీ కెరీర్ లో ఇదొక డిఫరెంట్ ఫిలిం అవుతుందని అనుకోవచ్చు. '1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా 'హత్య' సినిమా సాగనుంది.
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి ‘విజయ్ రాఘవన్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ కాంబోలో 'హత్య' సినిమా నిర్మితమవుతుండగా..త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు కలిసి చేస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.