సంక్రాంతి పండక్కి `వారసుడు`తో మెప్పించిన విజయ్‌.. ఇప్పుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ ప్రోమోని ప్రకటించారు.

దళపతి విజయ్‌ ఇటీవల సంక్రాంతికి `వారసుడు`తో హిట్‌ అందుకున్నాడు. ఈ సినిమాకి నెగటివ్‌ టాక్‌ వచ్చినా పండగ టైమ్‌లో రావడంతో బాగానే ఆడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు విజయ్‌. `ఖైదీ`, `మాస్టర్‌`, `విక్రమ్‌` చిత్రాలతో లోకేష్‌ యూనివర్స్ ని క్రియేట్‌ చేసిన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దళపతి 67గా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. భారీ కాస్టింగ్‌తో ఈ చిత్రం తెరకెక్కిబోతుంది. 

తాజాగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. టైటిల్‌ ప్రోమోని విడుదల చేశారు. ఇందులో ఓ అడవి ప్రాంతంలో ఉన్న భవనంలో ఓ వైపు ఛాక్లెట్‌ తయారి జరుగుతుండగా, మరోవైపు పెద్ద ఖడ్గం తయారు చేస్తుంటాడు విజయ్‌. మరోవైపు విజయ్‌ ఉన్న లొకేషన్‌కి పదికిపైగా కార్లు రాత్రి సమయంలో వస్తుంటాయి. విజయ్‌ కోసం వస్తోన్న ప్రత్యర్థుల్లా ఉన్నారు. మరి వారిని ఎదుర్కొనే సమయంలో లియో లియో లియో.. అంటూ బ్లడీ స్వీట్ అనే టైటిల్ ని ప్రకటించారు. ఓ ఖడ్గాన్ని తయారు చేసి, కణ కణ మండే ఆ ఖడ్గాన్ని ఛాక్లెట్‌ క్రీమ్‌లో ముంచి తీసి దాన్ని చిటికెన వేలుతో తీసుకుని చప్పరిస్తూ బ్లడీ స్వీట్‌ అని విజయ్‌ చెప్పడం హైలైట్‌గా నిలిచింది. 

`లియోః బ్లడీ స్వీట్‌` అనే టైటిల్‌ని ప్రకటించారు. ఇది ఆద్యంతం ఇంట్రెస్ట్ క్రియేట్‌ చేసేలా ఉండటం విశేషం. మరి దీనికి, సినిమాకి కథకి సంబంధమేంటనేది మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. దర్శకుడు లోకేష్‌ ఎన్నో అంశాలకు ముడిపెడుతూ స్క్రీన్‌ ప్లే డిజైన్‌ చేసుకుంటాడు. ఇందులో ఏం చెప్పబోతున్నాడనేది సస్పెన్స్ నెలకొంది. ఇక ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. అక్టోబర్ 19న దసరా పండుగ స్పెషల్‌గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

YouTube video player

ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా త్రిష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమెతోపాటు ప్రియా ఆనంద్‌ కనిపించనున్నారు. అలాగే సంజయ్‌ దత్‌, అర్జున్‌, మన్సూర్‌ అలీ ఖాన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోపై లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.