నయనతార- విఘ్నేష్ శివన్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సహజీవనం చేస్తున్న ఈ జంట అటు ప్రోఫిషనల్ గా కూడా సినిమాలు చేస్తూ.. సందడి చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నయన్ పై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు విఘ్నేష్ శివన్.
నయనతార- విఘ్నేష్ శివన్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సహజీవనం చేస్తున్న ఈ జంట అటు ప్రోఫిషనల్ గా కూడా సినిమాలు చేస్తూ.. సందడి చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నయన్ పై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు విఘ్నేష్ శివన్.
పర్సనల్ గా, ప్రోఫిషినల్ గా హ్యాపీ లైఫ్ ను అనుభవిస్తున్నారు నయనతార, విఘ్నేష్ శివన్. ప్రతీ విషయంలో ఒకరి ఆలోచనలు మరొకరు గౌరవించుకుంటూ, ఒకరికి మరోకరు సపోర్ట్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇదిగో పెళ్లి , అదిగో పెళ్లి అంటూ రూమర్లు వినిపించడం తప్పా..వీరుమాత్రం ఏ అనౌన్స్ మెంట్ లేకుండా.. హ్యాపీగా సహజీవనం చేస్తూ.. గడిపేస్తున్నారు. ఇక రీసెంట్ గా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కాతువాకుల రెండు కాదల్.
ఇక రీసెంట్ గా నయనతార గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు విఘ్నేష్ శివన్. ప్రియమైన తంగమే అని ప్రారంభించి కన్మణీ నాజీవితానికి పిల్లర్ లా సపోర్ట్ చేస్తున్నావు. నా ప్రతీ కష్టంలో వెన్ను తట్టి ధైర్యం చెపుతున్నావు. నువ్వు నాకు అండగా నిలవ బట్టే సరైన నిర్ణయాలు తీసుకోగలుతున్నాను. జీవితంలో నిరుత్సాహానికి గురైన ప్రతీ సారీ.. నువ్వు నాకు అండగా నిలిచి తీరు నన్ను ధైర్యంగా నిలబెట్టింది. నేను ఇన్ని సాధిస్తున్నను అంటే దానికి కారణం నువ్వే .. ఇదంతా నీవ్లే అంటూ నయనతారను ఆకాశానికి ఎత్తాడు విఘ్నేష్ శివన్.
అంతే కాదు కాతువాకుల కాదల్ సినిమా చేయబగాలిగానంటే మీ అందరి ప్రేమ సపోర్ట్ వల్లే అంటున్నాడు విఘ్నేష్. ఈసినిమాకు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతృప్తి నిచ్చిందన్నారు. ఈ విఫయంలో అందరికి థ్యాంక్స్ చెప్పాడు డైరెక్టర్ . నయనతార తన జీవితంలో ఉంటే ఇలాంటి విజయాలెన్నో సాధిస్తానంటున్నాడు విఘ్నేష్. ఇక చాలా కాలంగో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరి నిశ్చితార్జం అయిపోయినట్టు సమాచారం.
