సందర్భం వస్తే చాలు వేడుకలకు సిద్దమైపోతారు నయనతార మరియు విగ్నేష్ శివన్. నేడు ప్రేమికుల రోజు కావడంతో నయనతార  ప్రియుడు విఘ్నేష్ శివన్‌ తో కలిసి ఈ వాలెంటైన్స్ డే  సెలబ్రేట్ చేసుకున్నారు. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ట్రెడిషనల్‌గా చీర కట్టుకున్న ఫొటో షేర్ చేస్తూ 'హ్యాపీ వాలెంటైన్స్ డే.. సెలబ్రేట్ లవ్ ఎవిరీ డే.. వాలెంటైన్స్ డే విక్కీ నయన్' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నయన తార.

నయనతార, విఘ్నేష్ గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీలు దొరికినప్పుడల్లా విహార యాత్రలకు వెళ్లడం, తమ సాంప్రదాయ పండుగ ఓనం కి విఘ్నేష్ ని తన ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఇక పుట్టినరోజు వేడుకలైతే గోవా లేదా విదేశాలలో జరుపుకుంటారు ఈ జంట. ఇలాంటి అకేషనల్ పిక్స్ అన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది నయనతార.

ఇక విజయ్ సేతుపతి, నయన్ జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన విఘ్నేష్ తర్వాత సూర్యతో 'గ్యాంగ్' సినిమా తీశాడు. కొంత గ్యాప్ తర్వాత విజయ్ సేతుపతి, సమంత, నయనతారలతో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు.