బాలీవుడ్ నటి విద్యాబాలన్ వెక్కిరించొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. బాడీ షేమింగ్ విషయంలో కొందరు నటీమణులు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

అందులో విద్యాబాలన్ కూడా ఒకరు. లావుగా ఉన్న కారణంగా తన శరీరాన్ని అసహ్యించుకునేదాన్ని అంటూ ఆమె చాలాసార్లు చెప్పింది. ఇలాంటి అవమానాలు ఎదుర్కొనేవారికి సాయం చేయడానికి, ఇతరుల్లో స్ఫూర్తి నింపడానికి విద్యాబాలన్.. రేడియో స్టేషన్ బిగ్ ఎఫ్ ఎంతో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

ఈ కార్యక్రమం పేరు 'ధున్ బదల్ కే దేఖో'. ఈ నేపధ్యంలో బిగ్ ఎఫ్ ఎం విద్యతో కలిసి ఓ వీడియోను రూపొందించింది . ఆ వీడియోలో ఇతరుల శరీరాకృతిని, రూపుని చూసి వెక్కిరించొద్దని పాట పాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ జీవితంలో బాడీ షేమింగ్ ఘటనలు ఎదుర్కొన్న యువతీయువకులు ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది.