అజ్ఞాతవాసిలో మరో అజ్ఞాతవాసి.. సర్ప్రైజ్

victory venkatesh surprising role in pawan kalyan agnathavaasi
Highlights

  • పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి
  • సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 10న విడుదల
  • ఈ చిత్రంలో సర్ ప్రైజింగ్ రోల్ చేయనున్న వెంకీ?

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అజ్ఞాతవాసి’. ఈ మూవీలో మరో టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీ రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో వెంకీ పాత్ర ఎలా ఉండబోతుందని అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. గతంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గోపాల గోపాల’ చిత్రం అటు పవన్ అభిమానుల్ని, ఇటు వెంకీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

 

ఇక సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో మరో అజ్ఞాతవాసి ఉన్నాడని.. అతడే విక్టరీ వెంకటేష్ అంటూ సినీ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ మూవీలో వెంకీ పాత్ర చాలా కొత్తగా.. ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ రోల్‌లో వెంకటేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.‘అజ్ఞాతవాసి’ చిత్రంలో వెంకటేష్ ఒక 15 నిమిషాల పాటు కనిపించే అతిథి పాత్రలో మెరవనున్నట్టు సమాచారం. ఈ పదిహేను నిమిషాల ఎపిసోడ్ సినిమాకు చాలా కీలకం అని.. వెంకటేష్ పాత్రను త్రివిక్రమ్ తనదైన స్టైల్‌లో చాలా ఫన్నీగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. వెంకటేష్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌కు మేనమామగా నటిస్తున్నట్టు సమాచారం.

 

ఈ చిత్రంలో సీనియర్ నటి ఖుష్బు ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు. ఈమె పాత్ర చుట్టూనే ‘అజ్ఞాతవాసి’ కథ తిరుగుతుంది. దీన్నిబట్టి ఖుష్బు పాత్రకు ఈ సినిమాలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. తాజాగా వెంకీ ఈ సినిమాలో పవన్‌కు మేనమామగా నటిస్తుండటంతో.. ఖుష్బు పవన్‌కి అత్తగా చేస్తుందా అని అభిమానులు అంచనా వేస్తున్నారు.

 

loader