రీసెంట్ గా గురు సక్సెస్ తో సంతోషంగా వున్న విక్టరీ వెంకటేశ్ తాజాగా సల్మాన్ సుల్తాన్ మూవీని రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు ఈ మూవీలో హిరోయిన్ గా మరోసారి రితికా సింగ్ ఆఫర్ కొట్టేసిందట

విక్టరీ వెంకటేష్ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేశారు. తెలుగు ప్రేక్షకుల్లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ ఇండస్ట్రీకి వెంకటేష్ ఎంట్రీ ఇచ్చి దాదాపు ముప్పయి సంవత్సరాలు అవుతుంది. కథ సక్సెస్ అవుతుందన్న నమ్మకం కలిగితే.. మాస్ హీరో ఇమేజ్ సినిమాలే కాక ఎలాంటి సినిమాలైనా తనకు ఓకే అని నిరూపిస్తూ దృశ్యం చిత్రంలో ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నటించి మెప్పించారు.

‘గురు’ చిత్రంతో ఇటీవల మంచి విజయం సాధించిన వెంకటేష్ ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ గా కనిపించారు. ఇక వెంకీ నెక్స్ట్ మూవీ సురేష్ ప్రొడక్షన్స్‌ బేనర్లోనే వుండబోతుందట. ఆ మద్య బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘సుల్తాన్’ ను తెలుగులో తెరకెక్కిస్తున్నారట. రెజ్లింగ్ వీరుడి బయోపిక్‌గా తెరకెక్కిన ‘సుల్తాన్’ అనేక రికార్డులు కొల్లగొట్టింది.

సల్మాన్ ఖాన్ - అనుష్క శర్మ జంటగా నటించిన ఈ సినిమా, క్రితం ఏడాది భారీ విజయాన్ని సాధించింది. సల్మాన్ ఖాన్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. తాజాగా ‘సుల్తాన్’ మూవీని తెలుగు నేటివిటీకి తగినట్లుగా చేస్తూ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా గురు ఫేమ్ రితికా సింగ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘గురు’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.