మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం మోసగాళ్లు. ఇండో అమెరికన్ మూవీగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. దర్శకుడు జెఫ్రీ జే చిన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్స్ టీజర్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంఛ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐ టీ స్కామ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఆ స్కామ్ కి పాల్పడే మోసగాళ్లుగా మంచు విష్ణు మరియు కాజల్ కనిపించనున్నారని సమాచారం. కాజల్, విష్ణు బ్రదర్ అండ్ సిస్టర్స్ లా కనిపించడం మరో విశేషం. 

కాగా ఈ మూవీలో అల్లు అర్జున్ కీలకమైన క్యామియో రోల్ చేయనున్నారు. మోసగాళ్ల ఆచూకీ కనిపెట్టే పోలీస్ అధికారిగా ఆయన పాత్ర ఉండనుంది. దీనిపై ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. క్లైమాక్స్ లో వచ్చే బన్నీ పాత్రపై ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలలో అమితాసక్తి నెలకొని ఉంది. బన్నీ నటిస్తున్నాడన్న ప్రకటన మోసగాళ్లు మూవీకి మరింత హైప్ చేర్చింది. 

కాగా మరో హీరో మోసగాళ్లు కోసం రంగంలోకి దిగాడు. విక్టరీ వెంకటేష్ తన వాయిస్ ఓవర్ మోసగాళ్లు మూవీలో వినపించనున్నాడు. దీని కోసం ఆయన ఇప్పటికే రంగంలోకి దిగారు. మోసగాళ్లు మూవీలో పాత్రల పరిచయం, సన్నివేశాల వివరణ వెంకటేష్ తెర వెనుక నుండి వివరించనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. డబ్బింగ్ స్టూడియోలో మైక్ ముందున్న వెంకటేష్ ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇలా అనేక ప్రత్యేకతలతో మోసగాళ్లు మూవీ సిద్ధం అవుతుంది.