విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్.. దిల్ రాజుతో డబుల్ హ్యాట్రిక్.. క్రేజీ కాంబినేషన్ సెట్

విక్టరీ వెంకటేష్ కి ఈ సంక్రాంతి కలసి రాలేదు. శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్ చిత్రం దారుణమైన పరాజయంగా నిలిచింది. తన బాడీ లాంగ్వేజ్ కో సెట్ కాని కథని ఎంచుకుని వెంకీ మామ తప్పు చేశారు అంటూ కామెంట్స్ వినిపించాయి. 

Victory Venkatesh and anil ravipudi combination for third movie dtr

విక్టరీ వెంకటేష్ కి ఈ సంక్రాంతి కలసి రాలేదు. శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్ చిత్రం దారుణమైన పరాజయంగా నిలిచింది. తన బాడీ లాంగ్వేజ్ కో సెట్ కాని కథని ఎంచుకుని వెంకీ మామ తప్పు చేశారు అంటూ కామెంట్స్ వినిపించాయి. తిరిగి మళ్ళీ వెంకటేష్ ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వచ్చేస్తున్నారు. 

వెంకటేష్ కొత్త చిత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా క్రేజీ కాంబినేషన్ లో. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. అనిల్ రావిపూడి చివరగా నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి చిత్రం తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. 

అనిల్ రావిపూడి తదుపరి చిత్రం విక్టరీ వెంకటేష్ తో ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ చేసింది ఎవరో కాదు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఒక రకంగా అనిల్ రావిపూడి దిల్ రాజు ఆస్థాన దర్శకుడు అనే చెప్పాలి. అనిల్ రావిపూడి దిల్ రాజు బ్యానర్ లో 5 చిత్రాలు తెరకెక్కించారు. సుప్రీం, రాజా ది డ్రెస్, ఎఫ్ 2, ఎఫ్ 3, సరిలేరు నీ కెవ్వరు ఇలా ఈ చిత్రాలన్నీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చినవే. 

Victory Venkatesh and anil ravipudi combination for third movie dtr

ఇప్పుడు వెంకీతో తెరకెక్కించబోయే చిత్రం దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడికి డబుల్ హ్యాట్రిక్ చిత్రం. అలాగే ఎఫ్2, ఎఫ్ 3 తర్వాత అనిల్ రావిపూడి, వెంకీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ. అంటే హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ రెండు రికార్డులు ఒకే చిత్రంతో రాబోతున్నాయి. అని రావిపూడి వెంకటేష్ కోసం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హిలేరియస్ కథని ప్రిపేర్ చేశారట. వెంకటేష్ పల్లెటూరి నేపథ్యంలో నటించి చాలా కాలమే అవుతోంది. వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే మినిమమ్ గ్యారెంటీ హిట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios