కత్రినా కైఫ్ కన్నా విక్కీ కౌశల్ 5 ఏళ్ళు చిన్నవాడు. అయినప్పటికీ అతడిపై కత్రినా మనసు పారేసుకుంది. ఏది ఏమైనా వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. 

బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లకు సమానంగా కత్రినా క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ దశలో కత్రినా ఐశ్వర్యారాయ్ కంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా సంచలన సృష్టించింది. స్టార్ హీరోలతో పోటీ పడి మరీ డాన్స్ చేయగల సత్తా ఉన్న నటి కత్రినా కైఫ్. ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ గత ఏడాది డిసెంబర్ లో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

కత్రినా కైఫ్ కన్నా విక్కీ కౌశల్ 5 ఏళ్ళు చిన్నవాడు. అయినప్పటికీ అతడిపై కత్రినా మనసు పారేసుకుంది. ఏది ఏమైనా వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కత్రినా గురించి ఓ హాట్ న్యూస్ ప్రస్తుతం బిటౌన్ లో వైరల్ గా మారింది. కత్రినా కైఫ్ గర్భవతి అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. 

కత్రినా, విక్కీ కౌశల్ జంట గత ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కత్రినా గర్భం దాల్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలని విక్కీ కౌశల్ టీం ఖండించింది. అలాంటిది ఏమీ లేదని అవన్నీ రూమర్స్ అంటూ విక్కీ టీం మీడియాకు తెలిపారు. రూమర్స్ ఎక్కువవుతుండడంతో వాళ్ళు స్పందించారు. 

ప్రస్తుతం ఈ జంట వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కత్రినా తన భర్త విక్కీని స్విమ్మింగ్ పూల్ లో హగ్ చేసుకుని ఉన్న పిక్ వైరల్ గా మారింది. చాలా హాట్ గా ఉన్న ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్ సరసన టైగర్ 3 మూవీలో నటిస్తోంది.