Asianet News TeluguAsianet News Telugu

‘శుభవార్త’ ఎప్పుడంటూ కత్రినా కైఫ్ - విక్కీ కౌషల్ కు ఫ్యామిలీ ప్రెజర్? స్పందించిన బాలీవుడ్ స్టార్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా   కైఫ్ విక్కీ కౌషల్ పెళ్లి జరిగి రెండేళ్లు కావస్తోంది. దీంతో ఎప్పటి నుంచో వీరి నుంచి అభిమానులు గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక దీనిపై విక్కీ కౌషల్ కు ప్రశ్నఎదురైంది. 
 

Vicky Kaushal responded about family pressure on him and Katrina Kaif for good news NSK
Author
First Published Sep 9, 2023, 8:21 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా (Katrina Kaif)  కైఫ్, బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ పెళ్లి 2021 డిసెంబర్ లో గ్రాండ్ గా జరిగింది. హిందూ సంప్రదాయాల్లోనే వివాహ వేడుక జరిగింది. అయితే ఇప్పటికి వీరిద్దరి పెళ్లి జరిగి రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికే పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్లు తమ ప్రెగ్నెన్సీని ప్రకటించడం మొదటి బిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. దీంతో కత్రినా కైఫ్ - విక్కీ కౌషల్ నుంచి ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రమంలో విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ పైనా తమ కుటుంబం నుంచి శుభవార్త కోసం ఒత్తిడి పెరిగిందంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి. మరోవైపు కత్రినా ఇప్పటికే ప్రెగ్నెంట్ అంటూ కూడా అప్పుడప్పుడు న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా విక్కీ కౌషల్ స్పందించారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. 

అయితే, తాజాగా రేడియో సిటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్కీ కౌషల్ - తన భార్య, నటి కత్రినా కైఫ్‌ పై  కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుందన్న విషయంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మొదట మా డేటింగ్ విషయం ఇంట్లో అమ్మ, నాన్నకు తెలిసింది. ఇక మా నుంచి ‘గుడ్ న్యూస్’ కోసం ఇంట్లో నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. వారు చాలా ప్రశాంతమైన వారు’ అంటూ పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు వచ్చిన రూమర్లకు అడ్డుకట్ట పడింది. 

ఇక విక్కీ కౌషల్, కత్రినా కైఫ్  పెళ్లి తర్వాత మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్లు, టూర్లకు వెళ్తూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ ఉన్నారు. ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఇక కత్రినా కైఫ్ ‘టైగర్3’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విక్కీ కౌషల్ ‘సామ్ బహదుర్’, ‘డుంకీ’, ‘మేరే మెహబూబ్ మేరే సనమ్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios