కెబిసిలో సందడి చేశాడు బాలీవుడ్ యంగ్ హీరో.. కత్రీనాకైఫ్ భర్త విక్కీ కౌశల్. బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ కే షాక్ ఇచ్చాడు యంగ్ స్టార్. 

బరువు తగ్గడం అంటే అదోనెలల ప్రక్రియ.. రోజుల్లో చేయడం కష్టం. అంతే కాదు దానికంటూ కొన్ని నియమాలు.. స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కఠిన నీయమాలు కూడా పాటించాలి. బాగా ఇష్టమైన ఆహారం జంక్ ఫుడ్ అయి ఉంటే.. దాన్ని కూడా త్యాగం చేయాల్సిందే. ఇక వాటితో పాటు జాగింగ్, వాకింగ్ , ఎక్సర్సైజ్ లు తప్పనిసరి. కాని బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ మాత్రం ఇవేవి లేకుండానే బరువు తగ్గుతాడట. అది కూడా జంక్ ఫుడ్ తింటూ బరువు తగ్గుతున్నాడట. 

 వింటానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం అంటుననాడుయంగ్ స్టార్. ఈ విధంగా విక్కీ..ఈజీగా బరువు తగ్గేస్తాడంట. అంతే కాదు ఇది అతను తనకున్న అందమైన సమస్య గా చెప్పుకుంటున్నాడు విక్కీ. ఈ విషయాన్ని తను అమితాబ్ హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో వెల్లడించాడు విక్కీ. 

బిగ్‌బీ అమితా బచ్చన్‌ హోస్ట్‌గా చేస్తున్న ఈ షోకు బాలీవుడ్‌ నటి కియారా అడ్వానీతో కలిసి విక్కీ వచ్చాడు. ఇద్దరు కలిసి సందడి సందడి చేశారు. అంతే కాదు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా పంచుకున్నారు. ఈ సందర్భంగా విక్కీ మాట్లాడుతూ.. నాకో అందమైన సమస్య ఉంది. నేను బరువు పెరగడం లేదు. ముఖ్యంగా జంక్‌ ఫుడ్స్‌‌.. పిజ్జా, బర్గర్లు వంటివి తినడంతో బరువు తగ్గుతున్నాను తప్పించి పెరగడంలేదు అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. 

విక్కీ చెప్పిన మాటల విన్న బిగ్‌బీ, కియారా తో పాటు అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ప్రస్తుతం విక్కీ కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ విక్కీ కౌశల్ కు తనకంటే పెద్దదైన కత్రీన కైఫ్ ను పెళ్లాడు. చాలా కాలం ప్రేమించుకున్న వీరిద్దరు..తమ ప్రేమ విషయంలో కామ్ గా ఉండి.. సడెన్ గా పెళ్ళి చేసుకున్నారు. ఇక పెళ్లి తరువాత ఎవరి సినిమాలతో వారు బిజీగా గడిపేస్తున్నారు.