సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మొదటి హిట్ కొట్టాడు. ఆయన హీరోగా తెరకెక్కిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి విజయాన్ని అందుకుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఆనంద్ దేవరకొండకు రెండవ చిత్రం. ఆయన డెబ్యూ మూవీ దొరసాని. ఆ మూవీ పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ కమర్షియల్ గా అనుకున్నంత విజయం సాధించలేదు. కాగా ఆనంద్ దేవరకొండ తన మూడవ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 


కమల్ హాసన్-సింగీతం శ్రీనివాసరావ్ ఆల్ టైం క్లాసిక్ పుష్కక విమానం... టైటిల్ ని ఆనంద్ తన లేటెస్ట్ మూవీకి ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో టక్ చేసుకొని జెంటిల్ లుక్ లో ఎంప్లొయ్ గా ఆనంద్ దేవరకొండ కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ పోలీస్ గా కీలక రోల్ చేస్తున్నారని ఆయన లుక్ ద్వారా అర్థం అవుతుంది. మొత్తంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ తోనే మూవీకి కావలసినంత ప్రచారం దక్కించుకున్నారు టీం సభ్యులు. 


ఇక విజయ్ దేవరకొండ తన సొంత నిర్మాణ సంస్థ కింగ్స్ ఆఫ్ ది హిల్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్ పై దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం తెరకెక్కింది. డెబ్యూ డైరెక్టర్ దామోదర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాన్వి మేఘన, గీతా సైని హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు సమాచారం.