ప్రతీ దర్శకుడులోనూ ఖచ్చిచతంగా నటుడు ఉంటాడనేది నిజం. దాంతో వాళ్లు అప్పుడప్పుడు నటుడుగా వెండితెరపై కనిపించే ప్రయత్నం చేస్తూంటారు. ఇప్పుడు దర్శకుడు విఐ ఆనంద్ సైతం ఓ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర హీరో,నిర్మాత అయిన సందీప్ కిషన్ కన్ఫర్మ్ చేసారు. 

విఐ ఆనంద్ గతంలో సందీప్ కిషన్ తో టైగర్ అనే చిత్రం చేసారు. రీసెంట్ గా అల్లు శిరీష్ తో ఒక్క క్షణం చిత్రం చేస్తే అది వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు రవితేజతో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నారు. ఇంతకీ ఆయన గెస్ట్ గా కనిపించబోతున్న చిత్రం పేరేంటో తెలుసా...‘నిను వీడని నీడను నేనే’. 

యంగ్ హీరో  సందీప్‌ కిషన్ హిట్..ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా కొత్త కథాంశంతో మెప్పించే ప్రయత్నం చేస్తూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా సందీప్ ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ‌అన్య సింగ్‌  హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌ ఈ సినిమా కోసం నిర్మాతగా మారడం విశేషం. వెంకటాద్రి టాకీస్‌, వి స్టూడియోస్,‌ విస్తా డ్రీమ్‌ సంస్థలు ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి.