‘సల్మాన్ ని కొడితే రూ.2లక్షలు ఇస్తాం’

VHP leader Pravin Togadia’s associate offers Rs 2 lakh reward for thrashing Salman Khan
Highlights

మరో వివాదంలో సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనను బహిరంగంగా ఎవరైనా కొడితే.. వారికి రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామంటూ ఓ హిందూ సంస్థ ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సల్మాన్ హీరోగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఆయన నిర్మాణ సంస్థలో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం పేరు లవ్ రాత్రి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ వివాదానికి కారణమైంది.

ఈ సినిమా టైటిల్ విషయంలో విశ్వహిందూ పరిషత్‌ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియాకు చెందిన కొత్త సంస్థ ‘హిందూ హై ఆగే’ ఆగ్రా యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌ అయిన గోవింద్‌ పరశార్‌ సల్మాన్ కి  హెచ్చరికలు జారీ చేశారు. 

సల్మాన్‌ను ఎవరైనా బహిరంగంగా కొడితే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ లవ్ రాత్రి సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే అదే సమయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరగనుండటంతో.. హిందూ మనోభావాలను దెబ్బతీసేందుకే ఇలాంటి టైటిల్‌ పెట్టారని పలువురు మండిపడుతున్నారు.

గోవింద్‌తోపాటు పలువురు కార్యకర్తలు ఆగ్రాలోని భగవాన్‌ థియేటర్‌కు చేరుకొని ఈ సినిమా పోస్టర్లను తగలబెట్టి ఆందోళనకు దిగారు. సల్మాన్‌కు, సినిమా టైటిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. 

ఒకవేళ సినిమా విడుదలకు అనుమతి ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గోవింద్‌ హెచ్చరించారు. ఈ చిత్రంలో సల్మాన్‌ మరిది ఆయుష్‌ శర్మ కథానాయకుడిగా నటిస్తున్నారు.

loader