Asianet News TeluguAsianet News Telugu

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, కన్ను మూసిన స్టార్ కమెడియన్, షాక్ లో స్టార్ సెలబ్రిటీలు

ఫిల్మ్ ఇండస్ట్రీకి 2022 కలిసిరానట్టుంది. వరుస మరణాలతో పరిశ్రమ కుదేలవుతుంది. ఈ ఏడాది గొప్ప గొప్ప  నటులను పొగొట్టుకుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. క రీసెంట్ గా మలయాళ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు, కమెడియన్ అనారోగ్యంతో మరణించారు.  

Veteran Malayalam actor Kochu Preman passes away
Author
First Published Dec 5, 2022, 8:36 AM IST

వరుస  మరణాలు ఫిల్మ్ ఇండస్ట్రీని కోలుకోకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మరణాల సంఖ్య ఎక్కువగా పెరిగింది. సడెన్ గా మరణించిన వారితో పాటు.. అనారోగ్యంతో తుదిశ్వాసవిడిచినవారు ఎక్కువగా ఉన్నారు. ఒక్క టాలీవుడ్ నుంచే కాకుండా.. తమిళ , మలయాళ , హిందీ, కన్నడ , బెంగాలీ సినీ పరిశ్రమలనుంచి ఎవరో ఒకరు అనంత లోకాలకు చేరుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మయాళ సీనియర్ నటుడు, స్టార్ కమెడియన్ ప్రేమ్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. 

ప్రముఖ మలయాళీ నటుడు కొచ్చు ప్రేమన్ ప్రేరుతో బాగా పాపులర్ అయిన కే.యస్. ప్రేమ్ కుమార్ మరణించాడు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతూ వస్తున్న ఆయన… పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. 68 ఏళ్ళ కొచ్చు ప్రేమన్  కేరళ లో తిరువనంతపురంలో ఉన్న ఆయన నివాసంలోనే  తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ప్రేమన్ మరణ వార్త విని మాలీవుడ్ షాక్ తిన్నది. స్టార్ సెలబ్రిటీస్ దిగ్బ్రాంతి వ్యాక్తం చేశారు. ప్రేమ్ కుమార్ కు సంతాపంతెలుపుతున్నారు. 

కే.యస్. ప్రేమ్ కుమార్  మలయాళంలో 150 కి పైగా  సినిమాల్లో  నటించి మెప్పించారు. ఎక్కువగా కామెడీ రోల్స్ చేస్తుంటారు ప్రేమన్.  ఈయన కామెడీకి అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్స్ లో సహాయ నటుడిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రేమ్ కుమార్.. అంచలంచలుగా ఎదుగుతూ..ఫిల్మ్ ఇండస్రీలో స్టార్ కమెడియన్ అవతారం ఎత్తాడు. మలయాళ పరిశ్రమ నుంచి ఎన్నో అవార్డ్ లు సాధించిన ప్రేమన్ .. అకాలమరణంతో మలయాళ పరిశ్రమ చిననబోయింది. ఇక ప్రేమన్ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios