Asianet News TeluguAsianet News Telugu

సీనియర్ నటి జమునను తోసి కింద పడేసిన యంగ్ హీరో బౌన్సర్స్

  • దశాబ్దాలుగా తెలుగు వెండితెరపై వెలుగొందిన హీరోయిన్ గా వెలిగిన జమున
  • గత కొంత కాలంగా వయసుపైబడి సినిమాలకు దూరంగా వుంటున్న జమున
  • ఓ పెళ్లి వేడుకకు అతిథిగా వెళ్లిన జమునను తోసేసి పడేసిన యంగ్ హీరో మనుషులు
VETERAN ACTRESS JAMUNA HUMILIATED BY YOUNG HERO

ఎన్టీఆర్, ఎఎన్నార్ లాంటి దిగ్గజాల సరసన హీరోయిన్ గా నటించిన అలనాటి అందాల తార జమున.  82 సంవత్సరాల వయస్సు వయోభారంతో ఉన్నా ఇంకా హుషారుగా సినిమారంగానికి చెందిన చాలా కార్యక్రమాలలో కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు ఇప్పటికీ  అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక సంచలన కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఆమధ్య చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రం పై  ఈమె చేసిన కామెంట్స్ పెను సంచలనమే సృస్టించాయి.

 

ఇలాంటి పరిస్థితులలో ఈమెకు ఈ మధ్య ఒక ప్రముఖ టాలీవుడ్ సెలిబ్రిటీ కి సంబంధించిన పెళ్లి  ఫంక్షన్ లో ఒక యంగ్ హీరో వల్ల అవమానం జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇప్పడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న ఈ వార్తలు చాలా మందికి షాక్ ఇస్తున్నాయి.

 

తెలుస్తున్న సమాచారం మేరకు మొన్న హైదరాబాదులో జరిగిన ఓ పెద్ద పెళ్ళిలో చాలామంది సెలబ్రిటీలు సందడి చేశారు. అక్కడికి పాత తరం హీరోయిన్ జమున కూడా వచ్చారు అని తెలుస్తోంది.  ఇక అదే సమయంలో ఒక యంగ్ హీరో తన బౌన్సర్లతోపాటు  ఆ ఫంక్షన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 

 

అయితే ఆ ఫంక్షన్ లో  అటుగా నడుస్తున్న జమునను చూసి ఎవరో ముసలావిడ  ఆ యంగ్ హీరో  సెల్ఫీ కోసం వస్తోంది అని భావించి ఆ హీరోకు సంబంధించి నల్లరంగు బట్టలేసుకున్న బౌన్సర్లు వెంటనే ఆమెను నెట్టేశారు అని టాక్. దానితో ఆమె కింద పడిపోయిందిఅని తెలుస్తోంది. 

 

కనీసం వారు చేయిచ్చి ఆమెను లేపకపోగా అటుగా చూస్తున్న హీరో కూడా ఆ సంఘటనను పట్టించుకోకపోవడంతో అక్కడ ఆ పెళ్ళికి వచ్చిన మరికొంతమంది ప్రముఖులు జమునకు సహాయం చేసి నెమ్మదిగా ఆమెను కారు దాకా సాగనంపిన్నట్లు టాక్. జరిగిన ఈ సంఘటనను చూసి చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్లను పట్టించుకోవడం లేదు అని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అని కామెంట్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి..  

Follow Us:
Download App:
  • android
  • ios