బాలీవుడ్‌లో విషాదం.. కోవిడ్‌తో ప్రముఖ నటుడు యూసఫ్ హుస్సేన్ మృతి..
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు యూసఫ్ హుస్సేన్ (Actor Yusuf Hussain) మృతి చెందాడు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు యూసఫ్ హుస్సేన్ (Actor Yusuf Hussain) మృతి చెందాడు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యూసఫ్ అల్లడు, నిర్మాత హన్సల్ మోహతా వెల్లడించారు. యూసఫ్ హుస్సేన్ సినిమాలతో పాటుగా టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా కనిపించారు. దిల్ చాహ్తా హై, రాజ్, హజారోన్ ఖ్వైషీన్ ఐసీ, ఖాఖీ, వివాహ్, షాహిద్, OMG, క్రిష్ 3, విశ్వరూపం 2, దబాంగ్ 3 వంటి అనేక ఇతర చిత్రాలలో ఆయన నటించారు.
ఇక, హన్సల్ మోహతా.. యూసఫ్ హుస్సేన్ కూతురు సఫీనాను పెళ్లి చేసుకున్నారు. తన మామ మరణ వార్తను తెలియజేసిన హన్సల్ మోహతా ఈ వార్తను తాను జీర్ణించుకోలేక పోతున్నట్టుగా చెప్పారు. తన కేరీర్‌లో యూసఫ్ చేసిన సాయాన్ని గుర్తుచేశారు. ఆయన తనకు మామ మాత్రమే కాదని తండ్రి లాంటి వాడని అని పేర్కొన్నాడు. ఈ రోజు తాను నిజంగా అనాథను అయ్యానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
‘నేను షాహిద్ చిత్రం రెండో షెడ్యూల్‌లను పూర్తి చేసాను. అయితే ఆ తర్వాత నా చేతుల్లో డబ్బులు లేవు. నేను ఇబ్బంది పడ్డాను. ఫిల్మ్ మేకర్‌గా కెరీర్ దాదాపు పూర్తిగా ముగిసిపోయిందని అనుకున్నాను. అప్పుడు ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, నా దగ్గర ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంది. ఇబ్బంది పడుతుంటే నాకు దానితో ఉపయోగం లేదు అని చెక్కు రాసి ఇచ్చాడు. అప్పుడు షాహిద్ చిత్రం పూర్తయింది. అతడే యూసుఫ్ హుస్సేన్.
నాకు ఆయన మామగారు కాదు నాన్న. ఈరోజు ఆయన వెళ్లిపోయారు. స్వర్గంలో ఉన్న మహిళలందరికీ వారు ‘దునియా కీ సబ్సే ఖుబ్సూరత్ లడ్కీ అని మరియు పురుషులందరూ ‘హసీన్ నౌజ్వాన్’ అని గుర్తు చేయడానికి. యూసుఫ్ సాబ్ ఈ కొత్త జీవితానికి నేను మీకు రుణపడి ఉన్నాను. ఈరోజు నేను నిజంగా అనాథను అయ్యాను. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మేము నిన్ను చాలా మిస్ అవుతాం. నాకు మాటలు రావడం లేదు. లవ్ యు లవ్ యు లవ్ యు’ అని హన్సల్ మోహతా పేర్కొన్నాడు.
యూసఫ్ మృతిపై ప్రముఖ నటుడు అమితా బచ్చన్‌తో పాటుగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘#RIP యూసుఫ్ జీ. కుచ్ నా కహోతో మొదలై చివరగా బాబ్ బిస్వాస్ వరకు అతనితో చాలా సినిమాల్లో కలిసి పనిచేశాను. యూసఫ్ సౌమ్యుడు, చాలా జాలి కలిగిన వ్యక్తి. మంచి మనిషి. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాను’అని అమితాబ్ ట్వీట్ చేశారు. అభిషేక్ బచ్చన్, మనోజ్ వాజ్‌పేయితో సహా పలువురు ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పించారు.