బాలీవుడ​ నటుడు , మరాఠీ చిత్ర థియేటర్ నటుడు విజు ఖోటే  (77)  అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కావడంతో నిద్రలోనే ఆయన మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు.  

ఈరోజు ఉదయం చందన్‌వాడిలో  అంత్యక్రియలు నిర్వహించనున్నామని ఆయన  మేనకోడలు నటుడు భావన బల్సవర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజు ఖోటేకి హాస్పిటల్ లో చనిపోవడం ఇష్టం లేదని.. ఆ కారణంగానే ఆయన్ని ఇంటికి తీసుకువచ్చామని.. తీసుకొచ్చిన కొన్ని రోజులకే ఆయన మరణించారని.. ఆయన మరణం కుటుంబానికి తీరని లోటు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఫేమస్ బాలీవుడ్ సినిమా 'షోలే'లో  డెకాయిట్‌ కాలియా పాత్రతో పాపులర్‌ అయిన విజు ఆ తరువాత 'ఖయామత్ సే ఖయామత్ తక్', 'వెంటిలేటర్', 'జబాన్ సంభాల్కే' వంటి చిత్రాలతో పాటు 'జబాన్ సంభాల్కే' లాంటి టీవీ షోలో కూడా నటించారు.