Asianet News TeluguAsianet News Telugu

NTR : ఎన్ టీఆర్ 30 త్వరలోనే... అభిమానుల ఆనందం..!


యంగ్ టైగర్ ఎన్టీ ఆర్ తన అభిమానులకు పెద్దకానుకనే ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’మూవీతో బిజీగా ఉన్న ఎన్టీ ఆర్ నెక్ట్స్ మూవీ త్వరలోనే ప్రారంభం కానున్నట్టు సోషల్ మీడియాలో అభిమానులు హల్ చల్ చేస్తున్నారు.  

Very Soon NTR30 Upcoming Film Will Start, social media post
Author
Hyderabad, First Published Jan 16, 2022, 2:56 PM IST

టాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా, సినిమా పూజా కార్యక్రమం ప్రారంభమైన ఎక్కువగా సంతోషపడేది, ఆనందపడేది మాత్రం అభిమానులే. అందులో యంగ్ టైగర్ ఎన్టీ ఆర్ మూవీ రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకులు ఎంతో ఎక్సైట్ గా ఫీలవుతారు. అయితే ఇప్పటికే  ఎన్టీ ఆర్ తన ఆర్ఆర్ఆర్   సినిమా ప్రమోషన్ లోనే తిరుగుతున్నారు. 

కానీ ‘ఎన్టీఆర్ 30’ ఫిల్మ్ రిలీజ్ కాబోతున్నట్టు ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.  ఈ ఆదివారం సోషల్ మీడియాలో ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ రాబోయే సినిమాపై చాలా ఆసక్తిగా ప్రచారం చేస్తున్నారు. యాష్ ట్యాగ్  ఎన్టీ ఆర్ 30 పేరుతో కొరటాల శివ( koratala siva) దర్శకత్వంలో  ఎన్టీ ఆర్ తదుపరి సినిమా రానున్నట్టు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు.   

కాగా  ఈ సినిమా అనౌన్స్ మెంట్  త్వరలోనే  రానుందని సంతోషపడుతున్నారు.  కొరటాల శివ, ఎన్టీ ఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఎన్టీ ఆర్ కు జంటగా  బాలీవుడ్ సుందరి ఆలియా భట్ ను ఎంచుకున్నారట. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

అయితే ఈ సినిమా ప్రీ‌ ‌- ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే  హీరోయిన్, హ్యూజిక్ కంపోసర్ ను సంప్రదించారని సమాచారం.  ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ పాత్రలో  ఎన్టీ ఆర్ కనిపించనున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జోరందకుంది. కోవిడ్ కారరణంగా మార్చి నుంచి షూట్ ప్రారంభం కానున్నట్టు ఫ్యాన్స్ న్యూస్ ను  వ్యాప్తి చేస్తున్నారు. కానీ అధికారంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

జనతా గ్యారేజీ మూవీ ఆడియో లాంచ్ లో ఎన్టీ ఆర్ గురించి ఆకాశానికెత్తారు డైరెక్టర్ కొరటాల శివ. పలు సందర్భాల్లోనూ ఎన్టీ ఆర్ ను అందలమెక్కిస్తూ మాట్లాడటంతో ఫ్యాన్స్ వీరి కాంబినేషనల్ లో మూవీ రాబోతున్నట్టు భావిస్తున్నారు. 

మరోవైపు దర్శకధీరుడు  జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో ఎన్టీ ఆర్, రామ్ చరణ్, అలీయా భట్ ఉన్నారు. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానున్నారనుకుంటే వాయిదాతో సరిపెట్టారు. మళ్లీ డేట్ ప్రకటించే వరకు అభిమానులు ఎదురుచూడక తప్పదు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios