బాలీవుడ్‌ విలక్షణ నటుడు రణ్‌దీప్‌ హుడా మరోసారి ప్రేమలో పడ్డారట. ఆయన బాలీవుడ్‌ నటితో సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో, అటు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్‌ విలక్షణ నటుడు రణ్‌దీప్‌ హుడా(Randeep Hooda) మరోసారి ప్రేమలో పడ్డాడు. ఆయన గత ఎనిమిది నెలలుగా ప్రేమలో మునిగి తేలుతున్నారట. బాలీవుడ్‌కి చెందిన హీరోయిన్‌తో ఆయన సీక్రెట్‌ డేటింగ్‌ చేస్తుండటం ఇప్పుడు హిందీలో చర్చనీయాంశంగా మారింది. రణ్‌దీప్‌ హుడా ఎప్పుడూ ప్రైవేట్‌ లైఫ్‌నే ఇష్టపడతాడు. ఆయన పెద్దగా వార్తల్లో ఉండరు. కానీ ఇప్పుడు కొత్త ఎఫైర్ తో వార్తల్లో నిలవడం విశేషం. దీంతో ఇప్పుడిది హిందీనాట చర్చనీయాంశంగా మారింది. 

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రణ్‌దీప్‌ హుడా మణిపూర్‌కి చెందిన మోడల్‌, బాలీవుడ్‌ నటి లిన్‌ లైష్రామ్‌ (Lin Laishram)తో డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె `రంగూన్‌`, `ఓం శాంతి ఓం`, `మేరీకోమ్‌` వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఆరేళ్లుగా రణ్‌దీప్‌, లిన్‌ సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్నారట. 2016లో ఓ బాక్సింగ్‌ మ్యాచ్‌ తిలకించేందుకు వెళ్లినప్పుడు రణ్‌దీప్‌కి లిన్‌ పరిచయం అయ్యిందట. ఆ తర్వాత అది ప్రేమగా మారిందని, కాకపోతే మీడియా కంటపడకుండా రహస్యంగా ప్రేమవ్యవహారం సాగుతుందని తెలుస్తుంది. అయితే తాము రిలేషన్‌లో ఉన్నామనే విషయంపై వీరిద్దరు ఓపెన్‌ కాలేదు. కానీ తమ ప్రేమ వ్యవహారం నడిపించేందుకు రణ్‌దీప్‌ ఓ ప్రత్యేక ప్లేస్‌ని ఎంచుకున్నారట. 

కొద్ది రోజుల క్రితం వీరిద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోపై కొందరు నెటిజన్లు స్పందించారు. లవ్‌ లో ఉన్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే విషయం బయటపడటంతో అప్పటి నుంచే వీరి లవ్‌ స్టోరీ నడుస్తుందనే అభిప్రాయానికి వచ్చారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం లిన్‌ని మ్యారేజ్‌ చేసుకునే ఆలోచనలో ఉన్నారట రణ్‌దీప్‌. త్వరలోనే తమ పేరెంట్స్ కి, అలాగే ప్రియురాలు లిన్‌ పేరెంట్స్ ని కలిసి తమ ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే రణ్‌దీప్‌ హుడా ఇప్పటికే ప్రేమలో పడ్డాడు. ఆయన నటి నీతూ చంద్రతో డేటింగ్‌ చేశారు. దాదాపు మూడేళ్లపాటు వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. కొన్ని అనుకోని కారణాలతో వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఆ తర్వాత దీనిపై రణ్‌దీప్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. జీవితంలో కలలను సాధించాలంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద వాటిని త్యాగం చేయాలని తెలిపారు. తన కెరీర్‌ కోసం ఆయన ప్రేమని త్యాగం చేసినట్టు వార్తలొచ్చాయి. 

ఇక బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నారు రణ్‌దీప్‌ హుడా. ఆయన హీరోగా, విలన్‌గా, బలమైన పాత్రలు పోషిస్తూ రాణిస్తున్నారు. నటుడిగా తనలోని అనేక కోణాలను ఆవిష్కరిస్తున్నారు. ఆయన `హైవే`, `జన్నత్‌` 2`, `కిక్‌`, `సరబ్‌జిత్‌` వంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. చివరగా ఆయన సల్మాన్‌ ఖాన్‌ `రాధే`లో నటించారు.ప్రస్తుతం `అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` సినిమా చేస్తున్నారు. ఇందులో ఇలియానా కథానాయిక.