టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ & కామెడీ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ అవుతున్నాడు. బావ కోసం ఒకప్పుడు సైకిలెక్కి ఊరూరా ప్రచారం చేసిన హీరో ఇప్పుడు కారెక్కి మిరపకాయ్ బజ్జిలు వేస్తూ ఓటర్లను ఆకర్షించాడు. 

ఖమ్మం జిల్లా టీఆరెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరావు ప్రచారాల్లో జోరు పెంచారు. అయితే ఆయన కోసం సినీ నటుడు వేణు ప్రచారాలు నిర్వహిస్తున్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో రీసెంట్ గా ప్రచారం చేసిన వేణు ఒక హోటల్లో బజ్జిలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 

ఇటీవల ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో నామ నాగేశ్వరావు టీడీపీ (ప్రజకూటమి) తరపున పోటీ చేయగా అప్పుడు వేణు సైకిలెక్కి ఊరూరా ప్రచారం చేశారు. కానీ అప్పుడు నామ గెలవలేదు. అనంతరం టీఆరెస్ లో చేరడంతో పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది.