మరో సారి సంచలనంగా మారాడు ఫిల్మ్ ఇండస్ట్రీవాళ్ల జాతకాలు చెపుతూ.. వస్తోన్న, ప్రముఖ ఆ పండితుడు వేణు స్వామి. సంచలన విషయాలు వెల్లడించారు. ఇంతకీ ఆయన చెప్పిన విషయం ఏంటీ..?
ఫిల్మ్ సెలబ్రిటీల జాతకాలు అడక్కపోయినా చెప్పి సెన్సేషనల్ స్టార్ గా మారాడు ప్రముఖ ఆస్ట్రాలజీస్ట్ వేణు స్వామి. అయితే ఆయన చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతుండటం.. ముఖ్యంగా సినిమావాళ్ల విషయంలో అది నిజం అవుతుండటంతో.. ఆయన జోతిష్యంపై సెలబ్రిటీలకు నమ్మకం కలిగి.. కొంత మంది పబ్లిక్ గా.. మరికొంత మంది సీక్రేట్ గా.. వేణు స్వామిదగ్గరకు వెళ్లి తమ భవిష్యత్ ఎలా ఉందో చూపించుకుంటున్నారు.
ఇప్పటికే వేణు స్వామి చాలా విషయాల్లో సంచలన విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా సెలబ్రిటీల విడాకుల విషయంలో ఆయన చెప్పిందే జరిగిందంటూ.. ఇండస్ట్రీలో టాక్. ఇక వేణు స్వామి జాతకాలకు సంబంధించిన సెన్సేషన్స్.. కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా ఆయన అన్న మాటలు గుర్తుకు తెస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
తారకరత్న మరణానికి సబంధించి.. వేణుస్వామి రెండు నెలల కిందట ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకి లింక్ చేస్తున్నారు. ఈక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. టాలీవుడ్ లో త్వరలో ఓ యంగ్ హీరో చనిపోతాడు అని చెప్పాడు. తాజాగా తారకరత్న మరణించడంతో వేణుస్వామి వీడియో వైరల్ గా మారింది.
అంతే కాదు టాలీవుడ్ లో త్వరలో ఓ యంగ్ హీరోతొ పాటు యంగ్ హీరోయిన్ కూడా చనిపోతుందని.. . వారి వయసు 45 ఏళ్ల లోపే ఉంటుంది అని ఆయన చెప్పారు. అది కూడా మేష రాశికి చెందిన హీరోయిన్, వృశ్చిక లేదా మిథున రాశికి చెందిన హీరో చనిపోతాడు. అని సంచలన విషయాలు చెప్పారు.
అంతే కాదు ఆ మరణం అనారోగ్య కారణాల వల్ల జరుగుతుంది అన్నారు వేణు స్వామి. ఆత్మహత్య అయినా కావొచ్చు అని వేణు స్వామి అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆయన మాటలు నిజం అవుతాయా లేదా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వేణు స్వామి చెప్పినట్టు 40 లోపే యంగ్ హీరో తారకరత్న మరణించాడని..మరి ఆ హీరోయిన్ ఎవరా అంటూ చర్చలు మొదలయ్యాయి. కొంత మంది మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు.
ఇక ప్రస్తుతం వేణు స్వామికి డిమాండ్ పెరిగిపోయింది. ఆయన కోసం సినిమా వాళ్ళు క్యూకడుతున్నారు. వేణుస్వామితో జాతకం చెప్పించుకుని.. ఆయన చెప్పే పరిహారాలు కూడా చేస్తున్నారట. అంతే కాదు వేణు స్వామి చెప్పనట్టుగా హోమాలు , జపాలు కూడా చేస్తున్నారట సెలబ్రిటీలు.
