ఆ స్టార్ హీరోయిన్స్ మధ్యలో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడో సెన్సేషన్... ఎవరో తెలిశాక నోరెళ్లబెడతారు!

సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఫోటో వైరల్ అవుతుంది. సదరు ఫొటోలో ఓ టీనేజ్ కుర్రాడు హీరోయిన్ నగ్మా-రమ్యకృష్ణ మధ్య నిల్చొని ఫోటోకి ఫోజిచ్చాడు. కాగా అతడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 
 

venu swamy old photo posed with heroins nagma and ramyakrishna getting viral ksr

90లలో నగ్మా, రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్స్. వీరిద్దరి మధ్య ఒక కుర్రాడు బ్రాహ్మణుడు గెటప్ లో నిల్చుని ఉన్నాడు. ఇద్దరు అందాల భామల మధ్య అమాయకంగా ముఖం పెట్టి నిల్చున్న ఈ కుర్రాడు ఎవరనే సందేహం అందరిలో కలుగుతుంది. అయితే ఆ కుర్రాడు ఎవరో కాదు... మనందరికీ తెలిసిన సెన్సేషనల్ పర్సనాలిటీ. అలాగే అది గెటప్ కాదు. ఆయన నిజంగా బ్రాహ్మణుడే. ఇప్పటికే గుర్తించి ఉంటారు... మీరు ఊహించింది నిజమే. అతడు వేణు స్వామి. 

విషయంలోకి వెళితే వేణు స్వామి తమ్ముడు... ఆయన అరుదైన ఫోటోలతో ఒక వీడియో చేశాడట. సదరు వీడియోను వేణు స్వామి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. 1989 నుండి వేణు స్వామి చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులతో వివిధ సందర్భాలకు సంబంధించిన ఫోటోలు జోడించి ఆ వీడియో చేశారు. వాటిలో నగ్మా, రమ్యకృష్ణలతో దిగిన ఫోటో కూడా ఉంది. 

చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు మూవీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వేణు స్వామి హీరోయిన్స్ తో ఫోటో దిగారు. అది 1994 నాటి ఫోటో. ఇక వేణు స్వామి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో అరుదైన ఫోటోలు ఉన్నాయి. ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్స్ చిత్రాల పూజా కార్యక్రమాల్లో వేణు స్వామి పాల్గొన్నారు. అలాగే కేసీఆర్, చంద్రబాబు నాయుడు వంటి పొలిటికల్ లీడర్స్ తో కలిసి ఫోటోలు దిగారు. 

చిత్ర పరిశ్రమతో వేణు స్వామి అనుబంధం ఇప్పటిది కాదని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.  నూనూగు మీసాల వయసు నుండే బడా బాబుల కార్యక్రమాల్లో పూజలు చేసేవాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా వేణు స్వామి వివాదాస్పద స్వామిగా అవతరించాడు. సెలెబ్స్ మీద జాతకాల పేరిట ఆయన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది సదరు హీరోల ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. 

మరోవైపు వేణు స్వామికి చిత్ర ప్రముఖుల్లో కొందరు భక్తులుగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందాన తరచుగా వేణు స్వామిని కలుస్తారు. వేణు స్వామికి లక్షల రూపాయలు ఇచ్చి పూజలు చేయించుకుంటారు. వేణు స్వామి పూజ చేస్తే కెరీర్ విజయపథంలో సాగుతుందని నమ్ముతారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios