స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా ప్రాజక్ట్ లు సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి 
సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే సుకుమార్ ప్రాజెక్ట్ ఓకే చేసాడు బన్నీ. అలానే మురుగదాస్ తో కూడా సినిమా చేయనున్నాడని టాక్. ఇది ఇలా ఉండగా.. తాజాగా మరో సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది.

గతంలో దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో 'డీజే' సినిమా చేసిన బన్నీ ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. వేణుశ్రీరాం ఈ సినిమాకు దర్శకత్వంవహించనున్నారు.

సినిమా బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో బన్నీ విని ఓకే చేసేశాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తరువాత సుకుమార్ తో సెట్స్ పైకి వెళ్తాడా..? లేక వేణుశ్రీరాంతో చేస్తాడా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది!