ఒక సినిమా హిట్టయితే ఆ దర్శకుడు నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా? అని ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం సర్వసాధారణం. అయితే మన దర్శకులు మాత్రం ఆడియెన్స్ అంచనాలు తగ్గాక మెల్లగా డిఫరెంట్ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. దిల్ రాజు స్కూల్ నుంచి వచ్చిన వేణు శ్రీ రామ్ MCA సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 

ఆ సినిమా నాని కెరీర్ లో మంచి గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఇకపోతే ప్రస్తుతం వేణు ఒకసోషల్ డ్రామా తరహాలో ఉండే కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ కథకు ఇంకా సరైన హీరో దొరకడం లేదట. ఇద్దరి స్టార్ హీరోలకు చెప్పగా వారు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారట. మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ సెకండ్ సినిమా ఎమ్.సి.ఏ కథలకు పూర్తి బిన్నంగా వేణు ఈ సారి తన సినిమాను ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. 

కానీ అతనికి హీరోల నుంచి సపోర్ట్ దొరకడం లేదు. ఇక మొదట దిల్ రాజుకి కథ చెప్పిన దర్శకుడు మరికొంత మంది ప్రొడ్యూసర్స్ కి కూడా వినిపించినట్లు టాక్. ఎలాగైనా కొత్త ఏడాది స్టార్ హీరోతో సోషల్ డ్రామాను తెరకెక్కించాలని వేణు ప్రయత్నాలు జరుపుతున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.