తన సాహిత్యంతో దశాబ్దాల పాటు సాహితీ ప్రియులకు వినోదం పంచిన వెన్నెలకంటి ఇక లేదు. 2021 ప్రారంభంలోనే విషాదం నింపుతూ అందరినీ వదిలి ఆయన నింగికేగారు. వెన్నెలకంటి నేడు గుండెపోటుతో చెన్నైలో తన నివాసంలో మృతి చెందడం జరిగింది. వెన్నెలకంటి మృతి వార్త విన్న టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 
 

కెరీర్ లో 300వందల చిత్రాలకు పనిచేసిన వెన్నెలకంటి రెండు వేలకు పైగా పాటలు రాయడం జరిగింది. అలాగే అనేక హిట్ చిత్రాలకు ఆయన మాటల రచయితగా పనిచేశారు. ముఖ్యంగా వెన్నెలకంటి రాసిన పాటలు స్టార్ హీరోలకు మరపురాని విజయాలను కట్టబెట్టాయి. టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా చెప్పుకొనే అనేక పాటలు ఆయన రచించడం జరిగింది. కాగా నటసింహం బాలయ్య కెరీర్ లో మైలు రాయిగా నిలిచాయి ఆదిత్య 369, సమరసింహారెడ్డి చిత్రాలు. 

ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రయోగాత్మక చిత్రంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'రాసలీల వేళ' అనే హిట్ సాంగ్ ని వెన్నెలకంటి రచించడం జరిగింది. ఇక బాలయ్య కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ సమరసింహారెడ్డి చిత్రానికి గాను వెన్నెలకంటి గేయరచయితగా పనిచేశారు. ఆ మూవీ ఆల్బమ్ లో టాప్ సాంగ్ గా నిలిచిన ' రావయ్యా ముద్దుల మామ' సాంగ్ ని వెన్నెలకంటి రచించారు. బాలయ్యతో పాటు ఆ తరం టాప్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాలకు వెన్నెలకంటి గేయ రచయితగా పనిచేశారు.