కమెడియన్ వెన్నల కిషోర్ టాలీవుడ్ టాప్ కమెడియన్స్ లో ఒకడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుసగా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరి హీరోలతో పని చేస్తున్న కిషోర్ నెక్స్ట్ మరిన్ని డిఫరెంట్ గెటప్స్ తో నవ్వించనున్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో కిషోర్ కామెడీ పీక్స్ లో ఉంటుందని టాక్. 

త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో వెన్నల కిషోర్ పాత్ర ఫస్ట్ హాఫ్ లో కథానాయకుడితో కలిసి తెగ నవ్విస్తుందట. ఆ పాత్రను దర్శకుడు త్రివిక్రమ్ చాలా డిఫరెంట్ గా రాసినట్లు తెలుస్తోంది. ఇక క్లయిమాక్స్ లో కూడా కిషోర్ పాత్ర కీలకమని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో ప్రతి పాత్రకు ఒక ఒక ప్రత్యేకత ఉంటుంది. 

కనిపించేది ఒక్క సీన్ లో అయినా అది అందరికి గుర్తుండిపోతుంది. అందుకే ఆయన సినిమాల్లో నటించడానికి స్టార్స్ ఇష్టపడతారు. సుశాంత్ తో పాటు నవదీప్ కూడా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. హారిక - హాసిని క్రియేషన్స్ అలాగే గీత ఆర్ట్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.