మంచు మనోజ్, భూమా మౌనిక వివాహ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది.   కొంత కాలంగా ప్రేమలో ఉన్న మంచు మనోజ్, మౌనిక వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయ్యారు.  మంచు లక్ష్మి నివాసంలో జరిగిన పెళ్ళిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

మంచు మనోజ్, భూమా మౌనిక వివాహ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న మంచు మనోజ్, మౌనిక వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయ్యారు. మంచు లక్ష్మి నివాసంలో జరిగిన పెళ్ళిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగినప్పటికీ మంచు మనోజ్ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. 

చిత్ర పరిశ్రమ నుంచి సెలెబ్రిటీలు, మంచు భూమా కుటుంబాలు ఈ వివాహానికి హాజరయ్యారు. రెండు బలమైన కుటుంబాల నుంచి వచ్చిన మనోజ్, మౌనిక వివాహం కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. నవ దంపతులు సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

అయితే మనోజ్, మౌనిక వివాహ వేడుక సందర్భంగా ఒక స్పెషల్ వీడియో రూపొందించారు. ఈ వీడియోకి ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ వీడియోలో మంచు మనోజ్ బాల్యం గురించి ఫన్నీగా వెన్నెల కిషోర్ తెలిపారు. మంచు మనోజ్ కి ఫ్రెండ్స్ ఎక్కువ. ఎక్కడికి వెళ్లినా అతడి ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే మనోజ్, మౌనిక ఫామిలీ బ్యాగ్రౌండ్ గురించి కూడా పవర్ ఫుల్ గా చెప్పాడు. 

YouTube video player

మనోడు గుంటూరోడు అనే సినిమా తీసాడు కానీ పక్కా సీమ బిడ్డ. భూమా మౌనికది కూడా రాయలసీమే.. ఆళ్లగడ్డ ఆమె అడ్డా అంటూ ప్రాసలతో వెన్నెల కిషోర్ మెప్పించారు. మంచు మనోజ్ మంచి మనసు గురించి కూడా వెన్నెల కిషోర్ ఈ వీడియోలో తెలిపాడు. నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకునే వ్యక్తి మంచు మనోజ్. ఎలా సహాయపడగలను ? అని వాట్సాప్ స్టేటస్ లో కాదు ఏకంగా ప్రొఫైల్ పిక్ పెట్టేసుకునే మనస్తత్వం. దటీజ్ మనోజ్.. ఏడడుగులు ఏడూ జన్మల వరకు అలాగే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని వెన్నెల కిషోర్ ముగించాడు.