Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి `రుద్రనేత్ర`, `చంటబ్బాయ్‌` స్ఫూర్తితో వెన్నెల కిశోర్‌ `చారి 111`..

వెన్నెల కిశోర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ కమెడియన్. కానీఆయన హీరోగా టర్న్ తీసుకుంటున్నారు. `చారి 111` మూవీ చేశాడు. దీనికి చిరంజీవి మూవీస్‌కి సంబంధం ఉందట. 

vennela kishore chaari 111 inspired by chiranjeevi movies arj
Author
First Published Feb 24, 2024, 11:23 PM IST

వెన్నెల కిశోర్‌ హీరోగా చేస్తున్న మూవీ `చారి 111`. ఆయనకు జోడీగా సంయుక్తా విశ్వనాథన్‌ నటిస్తుంది. టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్లతో ఆసక్తిని పెంచింది. `జేమ్స్ బాండ్‌` మూవీస్‌ తరహాలోనే ట్రైలర్‌ ఉండటం, వెన్నెల కిశోర్‌ పాత్ర కూడా అదే స్టయిల్‌లో సాగుతున్న నేపథ్యంలో తాజాగా దర్శకుడు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడు టీజీ కీర్తి కుమార్‌ తొలి ప్రయత్నంగా `మళ్లీ మొదలైంది` మూవీని రూపొందించాడు. ఇప్పుడు `చారి111`తో వస్తున్నారు. 

ఈ మూవీ గురించి చెబుతూ, తాను రూపొందించిన 'మళ్ళీ మొదలైంది'లో 'వెన్నెల' కిశోర్ కమెడియన్ రోల్ చేశాడని, ఆ సినిమా చేసేటప్పుడు 'చారి 111' ఐడియా చెప్పాడట. తను కూడా ఇలాంటి సినిమానే చేయాలనిచూస్తున్న క్రమంలో తన స్క్రిప్ట్ నచ్చి ఓకే చేశాడట. `'చారి 111'కు ఇన్స్పిరేషన్ 'పింక్ పాంథర్', 'జానీ ఇంగ్లీష్' వంటి హాలీవుడ్ ఫిలిమ్స్. నేను వెన్నెల కిశోర్ ఫ్యాన్. 'జానీ ఇంగ్లీష్' ఫిల్మ్ చూసినప్పుడు  ఇండస్ట్రీలోకి ఎంటరైతే ఆయనతో అటువంటి సినిమా తప్పకుండా చేయాలని అనుకున్నా. నా ఫస్ట్ సినిమాలో ఆయన కమెడియన్ రోల్ చేశారు. తర్వాత ఆయనతో సినిమా చేశా. ఇలాంటి సినిమాలకు కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. కిశోర్, మురళీ శర్మ గారిని మనసులో పెట్టుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రాశా.  

`సినిమా జానర్  స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్. 'జేమ్స్ బాండ్' చూస్తే స్పై యాక్షన్. 'జానీ ఇంగ్లీష్' చూస్తే... స్పై యాక్షన్ కామెడీ. నాది రెండో కేటగిరీ సినిమా. కిశోర్ ని మైండ్ లో పెట్టుకుని స్క్రిప్ట్ రాశా. ఆయన 'నో' అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది కాదు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'రుద్రనేత్ర' ఇన్స్పిరేషన్ తో మా సినిమాలో స్పై ఏజెన్సీకి 'రుద్రనేత్ర' అని పేరు పెట్టాను. 'చంటబ్బాయ్' సినిమాను మర్చిపోకూడదు. అందులో చిరంజీవి డిటెక్టివ్. మా సినిమాలో హీరో స్పై రోల్ డిజైన్‌ చేశాను` అని వెల్లడించారు దర్శకుడు. 

ఇంకా చెబుతూ, వెన్నెల కిశోర్ బ్రిలియంట్ యాక్టర్. ఆ తర్వాత కమెడియన్. ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీ అద్భుతంగా చేశారు. నాకు ఆయనలో నటుడు ఇష్టం. 'ఓకే ఒక జీవితం' సినిమాలో చాలా సీరియస్ పోర్షన్స్ ఉన్నాయి. వాటిలో బాగా నటించారు. కామెడీ అవసరమైనప్పుడు కామెడీ చేస్తారు. 'గూఢచారి'లో కూడా సీరియస్ సీన్స్ బాగా చేశారు. సినిమాలో విలన్‌ ఎవరనేది సస్పెన్స్. అందుకే దాన్ని దాచి ఉంచాం.  'చారి 111'కు కూడా సీక్వెల్ ప్లాన్ ఉంది. ఈ యూనివర్స్ లో ఏ సినిమా చేసినా స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్ అవుతుందన్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios