ఎఫ్ 2 సూపర్ సక్సెస్ తో విక్టరీ వెంకటేష్ లో జోష్ పెరిగింది. అభిమానులకు మరింత వినోదం అందించేందుకు వెంకీ సిద్ధం అవుతున్నాడు. వెంకీ, నాగచైతన్య కలసి నటిస్తున్న తాజా చిత్రం వెంకీ మామ. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెండి తెరపై కూడా అలాగే కనిపించనున్నారు. జై లవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వంలో వెంకీ మామ చిత్రం తెరకెక్కుతోంది.  

బాబీ ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించనున్నాడు. ప్రస్తుతం వెంకీ మామ కీలక షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతోంది. గత నెలరోజులుగా జరుగుతున్న ఈ షెడ్యూల్ ని ఈ నెల 13న ముగిస్తారు. ఆ తర్వాత చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంటుంది. తాజాగా సమాచారం ప్రకారం దర్శకుడు బాబీ త్వరలో వెంకీ మామ టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నకాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

జూన్ 6న రామానాయుడు జయంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. మామ అల్లుళ్ళ గోలని ఈ టీజర్ లో శాంపిల్ గా చూపిస్తారట. టీజర్ విడుదలపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావలసి ఉంది. సురేష్ బాబు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.