పెద్ద సినిమాలకు రిలీజ్ అవుతూంటే...మిగతా సినిమాలు సైడ్ అయ్యి..దారి ఇస్తూంటాయి..దాంతో ఒక్కోసారి...వాటి దారినే మర్చిపోయి కన్ఫూజ్ అయిపోతాయి. కొత్త రిలీజ్ ఎప్పుడు ఫిక్స్ చేయాలో మళ్లీ లెక్కలు వేసుకుంటూ వెయిట్ చేయాల్సి వస్తుంది. సాహో గురించి ప్రక్కకు తప్పుకున్న సినిమాలు..ఎడ్జెట్స్ చేసుకునే క్రమం సైరా రిలీజ్ దాకా సాగుతోంది. సైరా కూడా భారీ సినిమానే కాబట్టి...అక్కడా అదే పరిస్దితి. సైరా కు సైడ్ ఇవ్వటానికి చాలా సినిమాలు సైడ్ అయ్యిపోతున్నాయి. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం కోసం వెయిట్ చేస్తున్నాయి. వెంకీ మామ సినిమా ది కూడా అదే పరిస్దితి. 

విక్టరీ హీరో వెంకటేష్‌, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ వెంకీ మామ. తొలిసారిగా నిజ జీవిత మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. డైరక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా అక్టోబర్‌ 4న రిలీజ్ చేయాలని భావించారు. 

అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని ఫిక్స్‌ అయ్యారు. దీంతో వెంకీమామ టీం ఆలోచనలో పడ్డారు. సైరా లాంటి సినిమాతో పోటి పడే కన్నా సినిమాను కాస్త వాయిదా వేయటం బెటర్ అని ప్రక్కకు తప్పుకుంటున్నారట. దాంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్దితి వచ్చింది.  రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కు తమన్ సంగీతమందిస్తున్నాడు.